News March 6, 2025
BREAKING.. వరంగల్: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ఒకరు మృతి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపూరం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 35 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 8, 2025
సమస్యల పరిష్కారానికి ఏలూరు సబ్‌కలెక్టర్ సూచనలు

నూజివీడులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందించే అర్జీలను ఆన్లైన్ చేయాలన్నారు. ప్రతి సమస్యను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలన్నారు. ఆయా శాఖల అధికారులు ప్రజల నుంచి తీసుకున్న ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించాలన్నారు.
News December 8, 2025
కల్వకుర్తి: 40 తులాల బంగారు ఆభరణాలు దొంగతనం

కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. కాలనీకి చెందిన పూజారి శ్రీనివాస శర్మ ఇంట్లో దొంగలు దోపిడీకి పాల్పడి 40 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఆరు లక్షల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. ఈనెల 30న కుటుంబ సభ్యులతో కలిసి ఊరు వెళ్లిన ఆయన సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు దొంగిలించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
News December 8, 2025
గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో ఫ్లైట్ రద్దు

విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వెళ్లే విజయవాడ-ఢిల్లీ, ఢిల్లీ-VJA ఇండిగో సర్వీసులు సోమవారం రద్దయ్యాయి. మధ్యాహ్నం 2:20 గంటలకు గన్నవరం చేరుకోవాల్సిన విమానం, 2:50 గంటలకు దిల్లీకి బయలుదేరాల్సిన విమానం సాంకేతిక కారణాల వల్ల రద్దు అయినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులకు టికెట్ ఛార్జీల రీఫండ్ లేదా రీషెడ్యూల్ చేసుకునే సౌకర్యాన్ని అందుబాటులో ఉంచామని ఇండిగో సంస్థ పేర్కొంది.


