News March 6, 2025
BREAKING.. వరంగల్: కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా.. ఒకరు మృతి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపూరం శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్చి కూలీలతో వెళ్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. దాదాపు 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. జీడిగట్టుతండా నుంచి ఇటుకలపల్లి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం 35 మంది ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 31, 2025
వరంగల్: ఎస్ఏ పరీక్షలు వాయిదా!

వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఎస్ఏ పరీక్షలను వాయిదా వేసినట్లు డీఈవోలు రంగయ్య, వాసంతి తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రతికూల పరిస్థితుల కారణంగా గురు, శుక్ర, శని వారాల్లో నిర్వహించాల్సిన పరీక్షలను వాయిదా వేశామని ఎప్పుడు నిర్వహించేది శనివారం వెల్లడిస్తామని రంగయ్య తెలిపారు. వర్షాల కారణంగా వాయిదా వేసిన పరీక్షలను సోమ, మంగళ, బుధవారాల్లో నిర్వహిస్తామని HNK DEO వాసంతి తెలిపారు.
News October 31, 2025
ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచాలి: కలెక్టర్ సిరి

కర్నూలు జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి గురువారం అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో 91 శాఖల అధికారులతో మూడు రోజుల పాటు జరిగిన ఇంటరాక్టివ్ సెషన్ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. స్టాండ్ అప్ ఇండియా పథకంపై అవగాహన పెంచాలని, నాబార్డ్ ద్వారా ఆర్ఐడీఎఫ్ నిధులు వినియోగించుకోవాలని సూచించారు.
News October 31, 2025
మ్యాట్రి’మనీ’ మోసాలపై కర్నూలు ఎస్పీ హెచ్చరిక

వివాహ సంబంధిత వెబ్సైట్లు, యాప్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న మ్యాట్రిమోనియల్ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం హెచ్చరించారు. నకిలీ పేర్లు, ఆకర్షణీయమైన ఫొటోలతో కూడిన ప్రొఫైల్స్ నమ్మి అమాయకులు మోసపోతున్న ఫిర్యాదులు తమ దృష్టికి వచ్చాయన్నారు. మోసపోయిన వారు ఆన్లైన్ ఫిర్యాదుల కోసం www.cybercrime.gov.inలో సంప్రదించాలని ఎస్పీ సూచించారు.


