News November 22, 2024
BREAKING.. వాజేడు : అన్నదమ్ములను హతమార్చిన మావోలు

ములుగు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్లనే నెపంతో అన్నదమ్ములను కత్తులతో పొడిచి హతమార్చారు. ఈ ఘటన వాజేడు మండలం జంగాలపల్లిలో జరిగింది. మృతులు ఊక అర్జున్, రమేశ్గా గుర్తించారు. రమేశ్ పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్నట్లు సమాచారం. కాగా, వాజేడు మావోయిస్టు కమిటీ శాంత పేరిట మావోలు లేఖ వదిలారు.
Similar News
News December 3, 2025
పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం: ఖమ్మం సీపీ

దట్టమైన పొగమంచు సమయాల్లో వాహన ప్రయాణం ప్రమాదకరమని, అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు నివారించాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారని, పొగమంచు కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల దృష్టిలో పెట్టుకొని స్వల్ప నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
News December 3, 2025
పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 20.5 అడుగులు

కూసుమంచి మండలం పాలేరు జలాశయం ప్రస్తుత నీటిమట్టం 20.5 అడుగులకు చేరింది. ఈ సందర్బంగా జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 20.5 అడుగులుగా ఉంది. ప్రస్తుతం నాగార్జునసాగర్ నుంచి జలాశయానికి నీటి విడుదల కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం నుంచి కింది కాల్వకు, తాగునీటికి నీటిని వినియోగిస్తున్నారు.
News December 3, 2025
ఖమ్మం: అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు

ఖమ్మం జిల్లాలో రెండో విడత నామినేషన్ల దాఖలు పూర్తయ్యాయి. అర్ధరాత్రి పొద్దుపోయేంతవరకు నామినేషన్లు దాఖలు చేశారు. 6 మండలాల్లో మొత్తం 183 గ్రామపంచాయతీలకు గాను 1055 నామినేషన్లు దాఖలయ్యాయి. అదే విధంగా 1686 వార్డులకు గాను 4160 మంది నామినేషన్లు దాఖలు చేశారు. కూసుమంచి మండలంలో అత్యధికంగా సర్పంచ్ పదవికి 250 మంది నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.


