News February 1, 2025

BREAKING: వేంపల్లి: కూలీల ఆటోను ఢీకొట్టిన బస్సు

image

వీరపునాయునిపల్లి మండలం నేలతిమ్మయ్యపల్లి సమీపంలో శనివారం ఉదయం కూలీల ఆటోను ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. వేంపల్లి రాజీవ్ నగర్ కాలనీకి చెందిన ఏడుగురికి గాయాలు కాగా, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఓ ట్రావెల్స్‌కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి వేంపల్లికి వస్తుండగా ఘటన జరిగింది. క్షతగాత్రులను 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 28, 2025

కడప: 4న వాలీబాల్ సెలెక్షన్ ట్రైయిల్స్

image

దక్షిణ భారత అంతర విశ్వ విద్యాలయాల వాలీబాల్ పోటీలలో పాల్గొనబోయే విశ్వ విద్యాలయ వాలీబాల్ స్త్రీ, పురుషులు జట్ల కోసం డైరెక్ట్ సెలెక్షన్ ట్రయల్స్ డిసెంబర్ 4వ తేదీ నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు సంబంధిత సర్టిఫికెట్‌లతో హాజరు కావాలని సూచించారు. ఎంపికలు విశ్వ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తామని వైవీయు క్రీడా బోర్డు కార్యదర్శి డా. కొవ్వూరు రామసుబ్బారెడ్డి తెలిపారు.

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరల వివరాలు.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బంగారం ధరల్లో నిన్నటికి, ఈరోజుకు తేడా లేదు. వెండి స్వల్పంగా రూ.30లు పెరిగింది. ధరల వివరాలు..
☛ బంగారం 24 క్యారెట్ల 1 గ్రాము: రూ.12,590
☛ బంగారం 22 క్యారెట్ల 1 గ్రాము: రూ.11,583
☛ వెండి 10 గ్రాములు: రూ.1680