News February 13, 2026
BREAKING: వైరా మున్సిపల్ పీఠం కాంగ్రెస్‌దే

వైరా మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ 20 వార్డులకు గాను 11 వార్డులు కాంగ్రెస్ సాధించింది. 2 వార్డులు ఇతరులు గెలిచారు. మిగతా వార్డులకు సంబంధించి కౌంటింగ్ జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో కాంగ్రెస్ పీఠం దక్కించుకుంది. దీంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.
Similar News
News March 17, 2026
ప్రచార రథాన్ని ప్రారంభించిన నల్గొండ కలెక్టర్

“ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలి యోజన” పథకం కింద జిల్లాలో ఎక్కువ మంది లబ్ధిదారులు వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం ఆయన “ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన” పథకంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన ప్రచార రథాన్ని కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన మంగళవారం ప్రారంభించారు.
News March 17, 2026
రేపే దివ్యాంగ శక్తి పథకం ప్రారంభం: మంత్రి మండిపల్లి

దివ్యాంగులకు ఉచిత బస్ ప్రయాణం కల్పించే “దివ్యాంగ శక్తి” పథకాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి బుధవారం ప్రారంభించనున్నారు. మార్చి 18న ఉదయం 11:30 గంటలకు రాయచోటి RTC బస్ స్టాండ్‌లో కార్యక్రమం జరగనుంది. ఈ పథకం ద్వారా దివ్యాంగుల ఆత్మగౌరవం, స్వావలంబనకు బలం చేకూరుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమానికి దివ్యాంగులు, పార్టీ నాయకులు, ప్రజలు పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.
News March 17, 2026
అక్రమ కేసులకు భయపడం: కాకాణి

తప్పు చేసిన వారిని వదిలేసి, ప్రశ్నించే వారిని జైలుకు పంపుతారా? అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు. నెల్లూరు జైలులో ఉన్న మాజీ డీసీసీబీ అధ్యక్షుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిని పరామర్శించారు. ఇసుక దోపిడీని ప్రశ్నించినందుకే ఆయనపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. కూటమి నేతలు చెప్పినట్లు అక్రమ అరెస్టులు చేస్తున్న అధికారులు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారని హెచ్చరించారు.


