News February 18, 2025
BREAKING: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో తప్పిన ప్రమాదం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లూ డార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య ఏర్పడింది. దీంతో రన్ వేపై అత్యవసర ల్యాండింగ్‌కు పైలెట్ అనుమతి కోరారు. అనంతరం కార్గో ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు.
Similar News
News October 27, 2025
అల్లూరి జిల్లా ఇన్‌ఛార్జ్‌గా వీ.వినయ్ చంద్

మొంథా తుఫాను నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 19 జిల్లాలకు ఇన్ ఛార్జులను నియమించింది. ఇందులో భాగంగా అల్లూరి జిల్లాకు సీనియర్ ఐఏఎస్ అధికారి వీ.వినయ్ చంద్‌ను ఇన్చార్జిగా నియమిస్తూ ప్రత్యేక ఉత్తర్వులను జారీ చేసింది. తుఫాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడంతో పాటు, ప్రజలకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు చేపట్టడంపై వీ.వినయ్ చంద్ జిల్లా ఇన్చార్జిగా బాధ్యతలను నిర్వహిస్తారు.
News October 27, 2025
కృష్ణా: తుఫాన్ భయం.. పంట రక్షణలో రైతులు నిమగ్నం

తుఫాన్ ప్రభావం కొనసాగుతుండడంతో ముందుగానే చేతికి వచ్చిన పంటను భద్రపరచుకునే పనుల్లో రైతులు జిల్లా వ్యాప్తంగా నిమగ్నమయ్యారు. వర్షం ఎప్పుడు మొదలవుతుందో అన్న ఆందోళనతో పంటను ఎండబెట్టి రాశులుగా చేసి భద్రపరుచుకుంటున్నారు. తుఫాన్ కారణంగా మిల్లర్లు ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం రాశులుగా వేసి తడవకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
News October 27, 2025
NLG: కల్లాల్లోనే ధాన్యం.. త్వరగా కొనరే..!

నల్గొండ జిల్లాలో రైతన్నలను కష్టాలు వెంటాడుతున్నాయి. 186 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా కొనుగోళ్లు మాత్రం వేగంగా జరగడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తుపాను ప్రభావం ఉంటుందని వార్తలు వస్తున్నాయని కల్లాల్లోనే ధాన్యం ఉంటే తీవ్రంగా నష్టపోతామంటున్నారు. కాగా జిల్లాలో ఇంకా 150 కేంద్రాలు తెరుచుకోవాల్సి ఉంది. కొన్ని కేంద్రాల్లో కల్లాలలోని ధాన్యం తడవడంతో పాటు వరదకు కొట్టుకుపోయింది.


