News February 18, 2025
BREAKING: శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో తప్పిన ప్రమాదం

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లూ డార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య ఏర్పడింది. దీంతో రన్ వేపై అత్యవసర ల్యాండింగ్‌కు పైలెట్ అనుమతి కోరారు. అనంతరం కార్గో ఫ్లైట్ సేఫ్‌గా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానంలో ఐదుగురు సిబ్బంది ఉన్నారు.
Similar News
News March 22, 2025
స్కూళ్లకు ఇవాళ సెలవు ఇవ్వాలని వినతి

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి. చాలా చోట్ల చెట్లు నేలకూలి రోడ్లపై పడ్డాయి. <<15840994>>ఇవాళ<<>> కూడా బలమైన గాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో స్కూళ్లకు సెలవు ఇవ్వాలని పేరెంట్స్ కోరుతున్నారు. గాలివానలో పిల్లలను పాఠశాలలకు పంపడంపై ఆందోళన చెందుతున్నారు. దీనిపై మీరేమంటారు?
News March 22, 2025
వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. నిందితుల అరెస్ట్

హిందూపురం 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించి, నిర్వాహకులు మంజుల, కానిస్టేబుల్ పురుషోత్తంను అరెస్ట్ చేసినట్లు సీఐ అబ్దుల్ కరీం తెలిపారు. టూటౌన్ స్టేషన్‌లో గతంలో పనిచేసిన కానిస్టేబుల్ సహకారంతో మోడల్ కాలనీలో మంజుల వ్యభిచార గృహం నిర్వహిస్తోంది. సమాచారం మేరకు దాడులు నిర్వహించగా.. ఈశ్వర్ అనే వ్యక్తి పారిపోయాడు. మంజుల, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకున్నారు.
News March 22, 2025
NRPT: ట్రైనీ కలెక్టర్‌కు ఘన సత్కారం

గతేడాది ఏప్రిల్‌లో శిక్షణ కోసం నారాయణపేట జిల్లాకు వచ్చి తిరిగి వెళ్తున్న ట్రైనీ కలెక్టర్ గరిమా నరులకు శుక్రవారం సాయంత్రం నారాయణపేట కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పూలమాల, పుష్పగుచ్ఛం అందించి ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. విధి నిర్వహణలో అనుభవాలను గరీమా గుర్తు చేసుకున్నారు. నిబద్ధత, చిత్తశుద్ధితో పని చేశారని కలెక్టర్ సూచించారు.