News August 10, 2024
BREAKING: శ్రీశైలం డ్యామ్ 4 గేట్ల మూసివేత
శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గటంతో రాత్రి 10 గేట్లలో 4 గేట్లను అధికారులు మూసివేశారు. కేవలం 6 గేట్ల ద్వారా నాగార్జున సాగర్‌కు 1,62,114 క్యూసెక్కులు, రెండు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 61,028 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ప్రస్తుతం శ్రీశైలానికి 1,85,664 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోంది. డ్యామ్ నీటిమట్టం 882.70 అడుగులు. 202.9673 TMCలుగా ఉంది.
Similar News
News September 15, 2024
యువకుడిని కాపాడిన నంద్యాల పోలీసులు
నంద్యాల టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా పోలీసులు కాపాడారు. వివరాలు.. గడివేముల మండలం మంచాలకట్టకు చెందిన మానస ఆత్మహత్యకు పాల్పడింది. మనస్తాపానికి గురైన మానస భర్త అశోక్ (25) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. బంధువుల సమాచారం, ఎస్పీ, డీఎస్పీల దిశానిర్దేశంతో ఆపరేషన్ బ్లూ కోల్ట్స్ సిబ్బంది కాపాడారు. అనంతరం కౌన్సెలింగ్ ఇచ్చి కుటుంబీకులకు అప్పగించారు.
News September 15, 2024
తుగ్గలి: వజ్రం దొరికింది
ఓ రైతుకు వజ్రం దొరికిన ఘటన తుగ్గలి మండలంలో జరిగింది. మండలంలోని సూర్యతండాకు చెందిన ఓ రైతు పొలం పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో ఆయనకు 8 క్యారెట్ల బరువైన వజ్రం దొరికింది. దానిని జొన్నగిరికి చెందిన ఓ వ్యాపారి రూ.10 లక్షలకు కొనేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.
News September 15, 2024
మహానందిలో భక్తుల సందడి
మహానంది ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా కనిపిస్తుంది. సెలవు రోజు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చారు. కోనేరులలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేపట్టారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి కొనసాగుతుంది. స్వామి, అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ ప్రాంగణాలు తిలకించారు.