News September 27, 2024
BREAKING: సంగారెడ్డి: గీతం యూనివర్సిటీలో విద్యార్థిని SUICIDE

ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ద్వితీయ సంవత్సరం చదువుతున్న వర్ష (19) అనే విద్యార్థిని హాస్టల్ రూమ్లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించగా గమనించిన విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 14, 2025
MDK: అమరవీరులను స్మరించుకుంటూ వ్యాసరచన పోటీలు: ఎస్పీ

మెదక్ జిల్లాలోని పోలీస్ ఫ్లాగ్ డే (అక్టోబర్ 21) సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రకటించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులను స్మరించుకునే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ పోటీలను తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మూడు భాషల్లో నిర్వహిస్తారు. 6వ తరగతి నుంచి ఆసక్తి ఉన్న విద్యార్థులు పాల్గొనాలని ఎస్పీ సూచించారు.
News October 14, 2025
MDK: మహిళపై లైంగిక దాడి, హత్య.. జీవిత ఖైదు

మెదక్ పట్టణంలో 2020లో జరిగిన మహిళపై లైంగిక దాడి, హత్య కేసులో నిందితుడికి జిల్లా న్యాయమూర్తి నీలిమ సంచలన తీర్పు ఇచ్చారు. నిందితుడైన ఫకీరానాయక్కు జీవిత ఖైదు, రూ.15 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. కల్లు దుకాణం వద్ద పరిచయం పెంచుకుని, పొలానికి తీసుకెళ్లి ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
News October 13, 2025
మెదక్: బాణాసంచ విక్రయాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: ఎస్పీ

దీపావళి పండుగ సందర్భంగా తాత్కాలిక టపాకాయల (బాణాసంచా) దుకాణాలు ఏర్పాటు చేసే వ్యాపారులు ముందస్తుగా అనుమతి పొందడం తప్పనిసరి అని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు తెలిపారు. వ్యాపారులు తమ దరఖాస్తులను సంబంధిత సబ్ డివిజన్ పోలీస్ అధికారి కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు. మార్గదర్శకాల కోసం కూడా సబ్ డివిజన్ పోలీస్ అధికారిని సంప్రదించాలని ఎస్పీ పేర్కొన్నారు.