News September 27, 2024

BREAKING: సంగారెడ్డి: గీతం యూనివర్సిటీలో విద్యార్థిని SUICIDE

image

ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ద్వితీయ సంవత్సరం చదువుతున్న వర్ష (19) అనే విద్యార్థిని హాస్టల్ రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు యత్నించగా గమనించిన విద్యార్థులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 9, 2025

మెదక్: ఓపెన్ స్కూల్ ప్రవేశాలకు గడువు పెంపు.!

image

ఓపెన్ స్కూల్‌లో 2024-25 విద్యా సంవత్సరానికి టెన్త్, ఇంటర్ ప్రవేశాల గడువును సెప్టెంబర్ 15 వరకు పొడిగించినట్లు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి రాధా కిషన్ తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. బడి మానేసిన పిల్లలకు ఓపెన్ స్కూల్ వరం అని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు https://www.telanganaopenschool.org/ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.

News July 8, 2025

మెదక్: 86 శాతం మందికి పంపిణీ

image

మెదక్ జిల్లాలో మూడు నెలల కోటాకు సంబంధించి బియ్యం పంపిణీ 86 శాతం మంది రేషన్ దారులు తీసుకున్నారు. జిల్లావ్యాప్తంగా 521 రేషన్ దుకాణాలు ఉన్నాయి. మొత్తం 2,16,716 కార్డుదారులు ఉండగా, 1,86,578 మంది బియ్యం తీసుకున్నారని డీఎస్‌వో నిత్యానందం తెలిపారు. జూన్, జులై, ఆగస్టుకు సంబంధించిన బియ్యం జూన్‌ 1 నుంచి 30 వరకు పంపిణీ చేశారు. మళ్లీ సెప్టెంబర్‌లో పంపిణీ చేయనున్నారు.

News July 8, 2025

రామాయంపేట: తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఉద్యోగ అవకాశాలు

image

రామాయంపేటలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ విజయలక్ష్మి సోమవారం తెలిపారు. 9, 10వ తరగతుల విద్యార్థులకు మ్యాథ్స్ HBT బోధించేందుకు ఉపాధ్యాయులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎమ్మెస్సీ మ్యాథ్స్ చదివిన అభ్యర్థులకు అవకాశం ఉందని, రూ.18,200 వేతనం అందజేస్తామని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.