News November 14, 2024

BREAKING.. సిరిసిల్ల: భార్యను హత్య చేసి పురుగుమందు తాగిన భర్త

image

సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. జిల్లా కేంద్రంలోని శాంతినగర్ శివారులో శాంతినగర్‌కు చెందిన యువ రైతు దంపతులు వరి పొలంలోనే మృతి చెందిన ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. భార్య వసంత(35)ను భర్త ముదం వెంకటేశం(43) హత్య చేసి తాను పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు, పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో పురుగు మందు డబ్బా, రక్తపు మరకలు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 10, 2026

KNR: ఐస్‌క్రీం తయారీ కేంద్రంపై దాడులు

image

కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అలుగునూరులో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ‘ఉత్తమ్ ఐస్ క్రీమ్’ తయారీ కేంద్రాన్ని జిల్లా ఆహార భద్రతా విభాగం అధికారులు తనిఖీ చేశారు. ప్యాకింగ్‌పై చిరునామా, FSSAI లైసెన్స్ నంబర్లు లేకపోవడం, తప్పుడు కేటగిరీలో లైసెన్స్ పొందడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు రూ.6,000 విలువైన స్టాక్‌ను సీజ్ చేసిన అధికారులు, తయారీదారులు వెంటనే లైసెన్సులు పొందాలని ఆదేశించారు.

News March 9, 2026

ప్రజావాణికి 352 దరఖాస్తులు: కలెక్టర్ చిత్రా మిశ్రా

image

ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యమిచ్చి, గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. కరీంనగర్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఆమె ప్రజల నుంచి 352 దరఖాస్తులను స్వీకరించారు. వృద్ధులు, దివ్యాంగుల వద్దకే వెళ్లి స్వయంగా వినతులు స్వీకరించిన కలెక్టర్.. సమస్యలపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి సత్వర పరిష్కారం చూపాలని అధికారులకు స్పష్టం చేశారు.

News March 8, 2026

కరీంనగర్‌లో రేపు 2కే రన్

image

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో MCK నుండి అంబేద్కర్ స్టేడియం వరకు రేపు ఉదయం 6.30 2K రన్ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. కార్పొరేషన్ లో E-వేస్ట్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఉద్యోగులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని, ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల సేకరణ నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.