News March 7, 2025
BREAKING: హనుమకొండ జిల్లాలో MURDER

హనుమకొండ జిల్లాలో కాసేపటి క్రితం దారుణం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. ఎల్కతుర్తి మండలం వీర్నరాయణపూర్లో తల్లిని కొడుకు గొడ్డలితో దారుణంగా నరికి చంపాడు. మృతురాలు వీర్నరాయణపూర్ గ్రామానికి చెందిన చదిరం రేవతిగా గుర్తించారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 1, 2025
నేడే ప్రబోధిని ఏకాదశి.. ఇలా చేస్తే కోటిరెట్ల పుణ్యం

తొలి ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన విష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడని పురాణ కథనం. ఈరోజంతా ఉపవాసం ఉంటూ, హరి నామస్మరణతో రాత్రి జాగరణ చేస్తే.. పుణ్యక్షేత్ర దర్శనం కన్నా కోటి రెట్ల ఫలం ఉంటుందని నారద పురాణం పేర్కొంది. అన్నదానం, నదీ స్నానాలతో అపమృత్యు దోషానికి పరిహారం లభిస్తుందని నమ్మకం.
☞ ప్రబోధిని ఏకాదశి విశేషాలు, కార్తీక మాస నియమాలు, ఇతర ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి<<>>.
News November 1, 2025
ఈ క్షేత్రం నుంచే శివుడు లోకాలను కాపాడుతున్నాడట

ఉజ్జయిని మహాకాళేశ్వర్లో శివుడు స్వయంగా మహాకాలుడిగా వెలసి, కాల స్వరూపంలో కొలువై ఉన్నాడు. ఇక్కడి నుంచే శివుడు కాలానికి అధిపతిగా ఉండి, సకల లోకాలను, సమస్త జీవరాశిని రక్షిస్తున్నాడని ప్రగాఢ విశ్వాసం. శివ పురాణంలో చెప్పినట్లుగా, ఈ స్వయంభూ లింగం శక్తి ప్రవాహాలను వెలువరిస్తూ, భక్తులను అకాల మృత్యువు నుండి, కాల భయం నుండి కాపాడుతూ, నిరంతరం రక్షా కవచంగా నిలుస్తుంది. ఆ మహాదేవుడి రక్షణే మనకు రామరక్ష.
News November 1, 2025
నవీపేట్: మహిళ దారుణ హత్య?

నవీపేట్ మండలం ఫకీరాబాద్ శివారులో బాసర వెళ్లే ప్రధాన రహదారి పక్కన వివస్త్రగా గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నవీపేట్ ఎస్ఐ తిరుపతి వివరాలు సేకరిస్తున్నారు. తల, కుడిచేయి వేళ్లు లేకుండా మహిళ మృతదేహం కనిపించింది. మహిళను హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


