News October 20, 2024

BREAKING: హరియాణా గవర్నర్ కాన్వాయ్‌కు రోడ్డు ప్రమాదం

image

గవర్నర్ బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న బండారు దత్తాత్రేయ కాన్వాయ్‌కు ఒక వ్యక్తి అడ్డు రావడంతో సడన్ బ్రేక్ వేయగా..ఒకదానికొకటి మూడు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రధాన దారిలో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News December 11, 2025

వార్డులు.. HYDలో వార్ మొదలు

image

GHMC వార్డులను 150 నుంచి ఏకంగా 300కు పెంచడంతో నగరంలో ఎన్నికల వేడిని రాజేసింది. ఈ నిర్ణయం కాంగ్రెస్-MIM రహస్య ఒప్పందమంటూ BJP తీవ్రస్థాయిలో మండిపడుతోంది. MIM డివిజన్లను 46 నుంచి 90కి పెంచి, కాంగ్రెస్ పరోక్షంగా లబ్ధి పొందుతోందని కమలదళం ధ్వజమెత్తింది. ​GHMC పరిధిలోని 50కి పైగా డివిజన్లలోని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లకు గాలం వేస్తూ ఎన్నికల వ్యూహాలకు INC పదును పెడుతోంది. అసలు ఆట ఇప్పుడే మొదలైంది.

News December 11, 2025

HYD: బ్యాలెట్ పేపర్ చించేశాడు.. ఓటరుపై కేసు

image

శంషాబాద్‌లో బ్యాలెట్ పత్రాన్ని చింపేసిన వ్యక్తిపై కేసు నమోదు అయ్యింది. శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ పరిధిలోని బురుజు గడ్డ తండాలో పోలింగ్ కేంద్రానికి ఉదయం ఓటు వేసేందుకు వచ్చిన వ్యక్తి బ్యాలెట్ పత్రాన్ని చించి వేశారు. ఈ ఘటనపై ఎలక్షన్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఒక అభ్యర్థికి ఓటు వేయబోయి.. పొరపాటున మరొకరికి తన ఓటు వేశానని పేపర్ చింపివేసినట్లు విచారణలో తేలింది.

News December 11, 2025

జీహెచ్‌ఎంసీ వార్డులపై ఫిర్యాదుల ‘సునామీ’

image

GHMC పరిధిలో వార్డుల పునర్విభజన ప్రక్రియపై అభ్యంతరాల పర్వం మొదలైంది. 300 వార్డులుగా డీలిమిటేషన్ చేస్తూ ముసాయిదా నోటిఫికేషన్ జారీ అవగా దీనిపై నిరసన గళం వినిపిస్తోంది. ప్రోఫార్మా-III ద్వారా అందిన వివరాల ప్రకారం.. డిసెంబర్ 10న ఏకంగా 40 ఫిర్యాదులు నమోదయ్యాయి. ముసాయిదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న వార్డుల సరిహద్దులు, జనాభా లెక్కలపై రాజకీయ పక్షాలు, స్థానిక ప్రజల నుంచి భారీగా విమర్శలు వస్తున్నాయి.