News February 27, 2026
BREAKING: అకౌంట్లలోకి డబ్బులు

TG: ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెండింగ్ బిల్లులు రూ.745 కోట్లను విడుదల చేసింది. వెంటనే వారి అకౌంట్లలో జమ చేయనుంది. ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలో భాగంగా గత ఏడాది జూన్ నుంచి ప్రతి నెలా దాదాపు రూ.700 కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లిస్తోంది. మరోవైపు గ్రామ పంచాయతీల్లో పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు మరో రూ.389 కోట్లను రిలీజ్ చేసింది.
Similar News
News February 28, 2026
రాజ్యసభ రేసులో LGBTQ.. ఎవరీ మేనకా గురుస్వామి?

మార్చి 16న జరిగే రాజ్యసభ ఎన్నికల్లో నాలుగు స్థానాలకు TMC ప్రకటించిన జాబితాలో మేనకా గురుస్వామి ఎంపిక అందరినీ ఆకర్షిస్తోంది. ఈమె సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది. LGBTQ(లెస్బియన్, గే, బై సెక్సువల్, ట్రాన్స్‌జెండర్, క్వీర్) వర్గానికి చెందినవారు. హోమో సెక్సువాలిటీని నేరంగా పరిగణించే IPC సెక్షన్ 377ను సుప్రీం కొట్టేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈమె RSకు ఎన్నికైతే తొలి LGBTQ ఎంపీగా రికార్డు సృష్టిస్తారు.
News February 28, 2026
విజయ్ అఫైర్ ఈమెతోనేనా?

తమిళ స్టార్ హీరో విజయ్‌కు ఒక నటితో <<19254560>>అఫైర్ <<>>ఉందని ఆయన భార్య సంగీత విడాకుల పిటిషన్‌లో పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఆ నటి పేరును ఆమె బయటపెట్టకపోయినా గతంలో విజయ్‌తో కలిసి నటించిన త్రిషతో ఆయనకు సంబంధం ఉందంటూ నెటిజన్లు పెద్దఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోలను పోస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20న కోర్టులో విజయ్ తన వైఖరిని స్పష్టం చేయాల్సి ఉంది.
News February 28, 2026
₹25 వేల కోట్ల స్కామ్‌లో క్లీన్ చిట్: ‘BJP వాషింగ్ మెషీన్’ విమర్శలు

మహారాష్ట్ర రాజకీయాల్లో ₹25 వేల కోట్ల MSCB స్కామ్ కేసు క్లోజ్ కావడం తీవ్ర చర్చకు దారితీసింది. ఎలాంటి అక్రమాలు జరగలేదన్న EOW రిపోర్టును ముంబై కోర్టు ఆమోదించింది. దీంతో దివంగత అజిత్ పవార్ BJP కూటమిలో ఉండటం వల్లే క్లీన్ చిట్ వచ్చిందంటూ ప్రతిపక్షాలు ‘BJP వాషింగ్ మెషీన్’ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నాయి. రాజకీయ అవసరాల కోసమే పవార్ కుటుంబంపై ఉన్న కేసులను మాఫీ చేశారని విమర్శకులు మండిపడుతున్నారు.


