News October 9, 2025

BREAKING: అల్లూరి జేసీ బదిలీ

image

అల్లూరి సీతారామరాజు జిల్లా జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్‌ను బదిలీ చేస్తూ చీఫ్ సెక్రటరీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పాడేరు ఐటీడీఏ పీవో తిరుమణి శ్రీ పూజకి అల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. అభిషేక్ ఏలూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

Similar News

News October 10, 2025

వనపర్తిలో 4 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

image

వనపర్తి పట్టణంలోని రాయిగడ్డ కాలనీలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. బొల్లెద్దుల ఆనంద్ ఇంట్లో అక్రమ రేషన్ బియ్యం నిల్వ ఉన్నాయన్న సమాచారంతో పట్టణ ఎస్ఐ హరిప్రసాద్ ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ తహశీల్దార్ దుబ్బాక పరమేశ్ తనిఖీలు నిర్వహించగా 4 క్వింటాళ్ల బియ్యం ఉన్నట్లు గుర్తించారు. బియ్యం స్వాధీనం చేసుకుని ఆనంద్‌పై కేసు నమోదు చేశామని పట్టణ ఎస్ఐ తెలిపారు.

News October 10, 2025

నాగర్‌కర్నూల్: హాస్టల్‌లో సమస్యలను పరిష్కరించాలి: ఎస్ఎఫ్ఐ

image

నాగర్‌కర్నూల్ పట్టణంలోని ప్రభుత్వ సంక్షేమ హాస్టల్‌లో ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు గురువారం సమస్యలపై విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్ మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులు అనేక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ విద్యార్థులకు దుప్పట్లు లేవని అన్నారు.

News October 10, 2025

నాగర్‌కర్నూల్: ‘చేగువేరా స్ఫూర్తితో యువత ఉద్యమించాలి’

image

నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలో గురువారం డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో విప్లవ వీరుడు చేగువేరా 58వ వర్ధంతిని నిర్వహించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా డీవైఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు ఆర్.శ్రీనివాస్ మాట్లాడుతూ.. చేగువేరా స్ఫూర్తితో సమాజంలోని అసమానతలపై యువత ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చంద్రమౌళి, సుల్తాన్, కృష్ణయ్య, వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.