News November 20, 2024
BREAKING: ఆదోని పెద్ద వంకలో మృతదేహం
ఆదోనిలోని బార్ పేటలో ఉన్న పెద్ద వంకలో బుధవారం ఉదయం గుర్తుతెలియని పురుష మృతదేహం ప్రత్యక్షమైంది. తెల్లవారుజామున శవాన్ని చూసిన ప్రజలు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహం పక్కనే ఓ చిన్నపాటి కత్తి ఉండటంపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై 3వ పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 21, 2024
21 కేసుల్లో దొంగలించిన సొత్తు రికవరీ.. 13 మంది అరెస్టు
కర్నూలు జిల్లాలోని 21 కేసుల్లో దొంగలించిన సొత్తును ఆదోని ఒకటో పట్టణ పోలీసులు రికవరీ చేసి 13 మందిని అరెస్టు చేశారని ఎస్పీ బిందు మాధవ్ తెలిపారు. రూ.24 లక్షల విలువ గల బైక్‌లను ఇదివరకే రికవరీ చేశారన్నారు. ఈరోజు రూ.41 లక్షల ప్రాపర్టీ రికవరీ చేయడంలో ఆదోని సబ్ డివిజన్ పోలీసులు బాగా పని చేశారన్నారు. ఆదోని డీఎస్పీ సోమన్న, సీఐ శ్రీరామ్, సిబ్బందిని అభినందించారు.
News November 21, 2024
బనవాసిలో 77 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కు: మంత్రి సవిత
ఎమ్మిగనూరు (మం) బనవాసిలో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుకు చేనేత, జౌళి శాఖ 91 ఎకరాల ప్రభుత్వ భూమిని 2016లో TDP ప్రభుత్వం కేటాయించిందని మంత్రి సవిత తెలిపారు. నిబంధనల మేరకు మూడేళ్లలో ఈ భూమిని వినియోగించకపోవడంతో 2020లో కర్నూలు కలెక్టర్ ఈ కేటాయింపులు రద్దు చేసి, పేదల ఇళ్ల స్థలాలకు 13.96 ఎకరాలను కేటాయించారన్నారు. మిగతా 77 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో మంత్రి పేర్కొన్నారు.
News November 21, 2024
పులి పిల్లలు అనుకున్నారు.. కానీ జంగం పిల్లి కూనలు
మండల కేంద్రమైన కొత్తపల్లి శివారులో బుధవారం జంగం పిల్లి కూనల సంచారం కలకలం రేపింది. కొత్తపల్లి నుంచి హరిహరం వెళ్లే దారిలో గోవిందు అనే రైతు పొలంలో 4 జంగం పిల్లి కూనలు రైతుల కంటపడ్డాయి. తొలుత ఈ కూనలను పులి కూనలని రైతులు భావించినప్పటికీ.. అటవీ అధికారులు అవి జంగం పిల్లి కూనలుగా గుర్తించారు. సాయంత్రానికి వాటి తల్లి వచ్చి పిల్లలను తీసుకెళ్లిందని రైతులు తెలిపారు.