News February 11, 2026

BREAKING ఆరిలోవలో మహిళ హత్య

image

విశాఖలోని ఆరిలోవలో ఓ మహిళ బుధవారం హత్యకు గురైంది. స్థానికుల వివరాల మేరకు.. ఆరిలోవ పాత పోలీస్ స్టేషన్ ఎదురుగా దుర్గా బజార్ సమీపంలోని ఇంట్లో లక్ష్మి హత్యకు గురైంది. సమాచారం అందుకున్న సీఐ మల్లేశ్వరరావు, ఎస్సైలు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. త్వరలో వివరాలు వెల్లడిస్తామని సీఐ వెల్లడించారు.

Similar News

News February 11, 2026

రామగుండం కార్పొరేషన్‌లో 69.32% శాతం నమోదు

image

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 59 డివిజన్లకు చెందిన 272 పోలింగ్ కేంద్రాల్లో మొత్తం 69.32% ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. 1,79,624 మంది ఓటర్లలో 1,24,520 మంది తమ ఓటు హక్కును వినియోగించారు. అందులో 62,868 మంది మహిళలు, 61,640 మంది పురుషులు, 12 మంది ఇతరులు ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఎన్నికలు సజావుగా పూర్తయిందని అధికారులు తెలిపారు.

News February 11, 2026

ANU: ఎంబీఏ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాల విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో గత నవంబర్ నెలలో జరిగిన ఎంబీఏ మూడో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు బుధవారం తెలిపారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులు ఈ నెల 19వ తేదీలోగా అందించాలని సూచించారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్ https://www.nagarjunauniversity.ac.in సంప్రదించాలన్నారు.

News February 11, 2026

కామారెడ్డి జిల్లాలో పోలింగ్ సరళి ఏవిధంగా ఉందంటే!

image

కామారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లో 92 వార్డుల్లో 1,49,525 మంది ఓటర్లున్నారు. జిల్లాలో పోలింగ్ సరళి ఉదయం మందకోడిగా సాగిన, పోలింగ్ ముగిసే సమయానికి పుంజుకుంది.
ఉదయం 9గం.లకు 6%
ఉదయం 11గం.లకు 26.86%
మధ్యాహ్నం 1గం.లకు 47.13%
సాయంత్రం 3గం.లకు 59.90%
పోలింగ్ పూర్తయ్యేసరికి 69.48%గా నమోదయ్యాయి.