News March 30, 2025
BREAKING: ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఐల బదిలీ

ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలువురు సీఐలను బదిలీ చేస్తూ ఆదివారం డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీచేశారు. ఆళ్లగడ్డ అర్బన్ పీఎస్ సీఐగా ఉన్న ఎస్.చిరంజీవిని కర్నూలు ఫ్యాక్షన్ జోన్ సీఐగా బదిలీ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు టూ టౌన్ సీఐగా ఉన్న ఎం.యుగంధర్ ఆళ్లగడ్డ UPS సీఐగా, నంద్యాల VRలో ఉన్న ఎం.గంగిరెడ్డి నంద్యాల సీసీఎస్-2 సీఐగా నియమితులయ్యారు. కర్నూలు VRలో ఉన్న వీ.శ్రీహరి మైదుకూరు UPSకు బదిలీ అయ్యారు.
Similar News
News April 1, 2025
కర్నూలు: పరీక్షా కేంద్రంలో కలెక్టర్ తనిఖీ

పదో తరగతి పరీక్షల్లో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా కర్నూలు నగరంలోని దామోదరం సంజీవయ్య, స్మారక మున్సిపల్ హై స్కూల్ పరీక్షా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ బాషా మాట్లాడుతూ.. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కల్పించడంలో అధికారులు సఫలమయ్యారని అన్నారు. ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు చూసుకోవాలని ఆదేశించారు.
News April 1, 2025
‘విశాఖలో చంపి సాలూరులో వేలాడదీశారు’

సాలూరు మండలంలో గత నెల జరగిన యువతి హత్య కేసును పోలీసులు చేధించారు. సాలూరు మండలానికి చెందిన ఐశ్వర్య విశాఖలో పనిచేస్తోంది. వివాహితుడు రాంబాబుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. గుడ్డిగా ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోవాలని అడగ్గా ఇద్దరి మధ్య గొడవలు చెలరేగాయి. రాంబాబు యువతిని ఆరిలోవలోని ఓ రూములో చంపి ఫ్రెండ్స్ సాయంతో బైక్‌పై తీసుకెళ్లి సాలూరులోని జీడితోటలో చెట్టుకు చున్నీతో ఉరి వేసి ఆత్మహత్యలా చిత్రీరించాడు.
News April 1, 2025
కాకాణి గోవర్ధన్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై SC, ST కేసు నమోదైంది. గిరిజనులను బెదిరించినట్లు నెల్లూరు (D) పొదలకూరులో PSలో కేసు నమోదు చేశారు. అటు మైనింగ్ కేసులో ఇవాళ 11 గంటలకు విచారణకు రావాలని నిన్న పోలీసులు నోటీసులు ఇవ్వగా.. ఆయన గైర్హాజరయ్యారు. ప్రస్తుతం నెల్లూరు, హైదరాబాద్‌లో కాకాణి అందుబాటులో లేరని తెలుస్తోంది. మరోవైపు, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది.