News February 26, 2026
BREAKING: ఉమ్మడి వరంగల్‌లో భారీగా IASల బదిలీలు

హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీశ్‌ను మహబూబాబాద్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. చాహత్ బాజ్ పాయ్‌ను హనుమకొండ కలెక్టర్‌గా నియమించిన ప్రభుత్వం.. GWMC ఇన్‌ఛార్జ్ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించింది. జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషాను బదిలీ చేసి ఆయన స్థానంలో సందీప్ కుమార్ ఝాను, ఏటూరునాగారం ITDA పీవో చిత్రమిశ్రా కరీంనగర్ కలెక్టర్‌గా బదిలీ చేశారు. వరంగల్ లోకల్ బాడీస్ అదనపు కలెక్టర్‌గా గణేశ్‌ను నియమించారు.
Similar News
News March 1, 2026
తిరుమల: మరో రెండు రోజుల్లో ఏకసభ్య కమిషన్

కల్తీ నెయ్యి ఘటనపై ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ మరో రెండు రోజుల్లో తిరుమలకు రానున్నట్లు సమాచారం. కమిషన్ వచ్చాక చేయాల్సిన ఏర్పాట్లపై శనివారం టీటీడీ అధికారులు చర్చించుకున్నారు. వారు కార్యాలయంతో పాటు నెయ్యి టెండర్ల నిబంధనలు, వాటికి సంబంధించిన ఫైల్స్ తదితర వాటిని పరిశీలిస్తారు. కేసులో ప్రమేయం ఉన్న వారిని విచారించే అవకాశం కూడా ఉంది. 45 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందజేస్తారు.
News March 1, 2026
వేట్లపాలెం ఘటన.. రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లోనే CM, పవన్ చర్చ (PHOTO)

వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనపై రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో శనివారం సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించుకున్నారు. బాధితులను పరామర్శించి అమరావతి వెళ్తున్న సీఎంకు, కాకినాడ వెళ్తున్న పవన్ కళ్యాణ్ ఎదురయ్యారు. ఈ సందర్భంగా ప్రమాద తీవ్రత, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన కఠిన చర్యలపై ఇరువురు నేతలు కొద్దిసేపు చర్చించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు.
News March 1, 2026
పాక్‌కు చుక్కలు చూపించిన లంక

T20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌కు శ్రీలంక చుక్కలు చూపించింది. ఆ జట్టును సెమీస్ చేరకుండా ఇంటికి పంపడమే కాకుండా దాదాపు గెలిచినంత పనిచేసింది. 213 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆ జట్టు 207 రన్స్ చేసి కేవలం 5 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి ఓవర్‌లో 28 రన్స్ కొట్టాల్సి ఉండగా శనక(31 బంతుల్లో 76*) 3 సిక్సర్లు బాదడంతో పాక్ గజగజ వణికిపోయింది. అయితే చివరి రెండు బాల్స్ డాట్ కావడంతో పాక్ గట్టెక్కింది.


