News April 2, 2024

BREAKING: ఏసీబీ వలలో టంగుటూరు ఎస్ఐ

image

టంగుటూరు పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ వ్యక్తి నుంచి రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి రూ.70వేలును ఎస్ఐ నాగేశ్వరరావు లంచంగా తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మేరకు ఏసీబీ డీఎస్పీ శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 27, 2026

ఒంగోలులో జాబ్ మేళా.. రూ.37,500 వరకు శాలరీ!

image

ఒంగోలులోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 29వ తేదీన జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. టెన్త్ నుంచి డిగ్రీ వరకు చదివిన నిరుద్యోగులు జాబ్ మేళాకు హాజరు కావొచ్చన్నారు. ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళా నిర్వహిస్తామని, రూ.37,500 వరకు వేతనం పొందే జాబ్స్ ఉన్నట్లు ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News January 27, 2026

ఉమ్మడి ప్రకాశం: గురుకులాల్లో ప్రవేశాలు

image

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని 13 గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యాసంవత్సరానికి ప్రవేశపరీక్షకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కో-ఆర్డినేటర్ జయ తెలిపారు. ఈ మేరకు ఆమె మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఇతర వివరాలకు, అలాగే దరఖాస్తు చేసుకునేందుకు http://apgpcet.apcfss.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని, అర్హులు ఫిబ్రవరి 19లోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు.

News January 27, 2026

కనిగిరి మీదుగా రైలు.. 30న ట్రయల్ రన్.!

image

కనిగిరి ప్రాంత వాసుల చిరకాల స్వప్నం త్వరలోనే నెరవేరనుంది. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కనిగిరి రైల్వే స్టేషన్‌కు పలుమార్లు గూడ్స్ రైళ్లు రైల్వే సామాగ్రీ తీసుకొచ్చాయి. 30న ట్రయల్ రన్ వేయనున్నారు. కనిగిరి- శంకవరం క్వారీల మధ ట్రాక్‌ ఏర్పాటుకు కొన్ని ఇబ్బందులు రాగా చివరికి గ్రీన్ సిగ్నల్ పడింది. స్టేషన్‌‌కు 300 మీటర్ల దూరంలో హైవే ఏర్పాటు కావడం గమనార్హం.