News December 18, 2025
BREAKING: ఓజిలి MRO, VRO సస్పెండ్

ఓజిలి(M) వీర్లగుణపాడులో భూ ఆక్రమాలు వెలుగుచూశాయి. ప్రభుత్వ భూమిని అసైన్డ్ భూమిగా చూపిస్తూ తప్పుదారి పట్టించే ఎండార్స్‌మెంట్‌లు జారీ చేసినందుకు MRO ఏ.పద్మావతిని అధికారులు సస్పెండ్ చేశారు. రెవెన్యూ రికార్డులు, ఫీల్డ్ పరిశీలనలను పక్కనపెట్టి పరస్పర విరుద్ధంగా VRO నివేదికలపై ఆధారపడినట్టు విచారణలో తేలింది. దీంతో వీఆర్వోను సైతం సస్పెండ్ చేశారు.
Similar News
News December 19, 2025
భద్రాద్రి జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

✓ మణుగూరు: ఆదివాసీలను ఆదుకుంటాం: ఎమ్మెల్సీ కవిత
✓ భద్రాచలంలో రేపటి నుంచి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు
✓ కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు జిల్లాలో ప్రత్యేక సర్వే
✓ గుండాల: గ్రూప్ 3లో సత్తా చాటిన రాకేష్
✓ ముక్కోటి వేడుకకు ముస్తాబైన పర్ణశాల
✓ చెక్ బౌన్స్ కేసులో ఇద్దరికీ 6 నెలల జైలు శిక్ష
✓ అశ్వాపురం: డివైడర్‌ను ఢీ కొట్టిన లారీ
✓ భద్రాద్రి జిల్లా వైద్య విధాన పరిషత్ సేవలు కొనియాడిన మంత్రి
News December 19, 2025
VZM: ఘనంగా వాజ్‌పాయ్ విగ్రహావిష్కరణ

భారత రత్న, మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పాయ్ కాంస్య విగ్రహాన్ని వీటీ అగ్రహారంలోని వై జంక్షన్ వద్ద రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ శుక్రవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసుల నాయుడు, ఎమ్మెల్యేలు కిమిడి కళావెంకటరావు, పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు.
News December 19, 2025
HYD: ఓయూలో కొత్తగా ‘బయో ఇన్ఫర్మేటిక్స్’ కోర్సులు

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో కొత్తగా బయో ఇన్ఫర్మేటిక్స్ కోర్సులను ప్రారంభించనున్నట్లు వీసీ ప్రొ. కుమార్ మోలుగురం తెలిపారు. వర్సిటీ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మౌలిక సదుపాయాల కోసం కేటాయించిన రూ.1000 కోట్లలను సమర్థవంతంగా వినియోగిస్తామన్నారు. విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా బయో ఇన్ఫర్మేటిక్స్‌లో యూజీ, పీజీ కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు.


