News March 22, 2025
BREAKING: ఓర్వకల్లుకు చేరుకున్న పవన్ కళ్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపటి క్రితమే ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు కర్నూలు జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఇతర ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. కాగా, మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గాన ఓర్వకల్లు మండల పరిధిలోని పూడిచర్ల చేరుకొనున్నారు.
Similar News
News March 22, 2025
నంద్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

☞ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం☞ ఫరూక్ కుటుంబీకులకు సీఎం CBN పరామర్శ☞ పూడిచెర్లలో ఫారం పాండ్ నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భూమి పూజ☞ అజ్ఞాతంలో జనని బ్యాంక్ సీఈఓ.. ఆందోళనలో డిపాజిటర్లు☞ లింగాపురంలో వ్యక్తి దారుణ హత్య☞ నీటి కుంటల తవ్వకాలను పరిశీలించిన కలెక్టర్☞ 26న మంత్రి బీసీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు☞ రంగాపురంలో టిప్పర్ ఢీ కొని వ్యక్తి మృతి☞ మయాలూరులో వర్షానికి కూలిన భారీ వృక్షం
News March 22, 2025
పెట్రోలింగ్ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి:ఎస్పీ

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో బ్లూ కోల్ట్స్, పెట్రో కార్ విధులు నిర్వర్తించే సిబ్బందితో ఎస్పీ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రతి ప్రాంతంలో రోడ్లపై సంచరిస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలని సూచించారు. డయల్ 100 ఫోన్ రాగానే వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలన్నారు.
News March 22, 2025
రుణమాఫీ విషయమై బీఆర్ఎస్ వాకౌట్

TG: రుణమాఫీ విషయంపై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. అనంతరం ఆ పార్టీ నేత హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ‘అందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ అని సీఎం రేవంత్ ప్రకటించారు. రూ.2 లక్షలపైన ఉన్నవారు మిగతావి కడితే సరిపోతుందన్నారు. కానీ ఇప్పుడు రూ.2 లక్షలలోపు వారికే రుణమాఫీ అని బుకాయిస్తున్నారు. ఇందుకు నిరసనగానే అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నాం’ అని హరీశ్ పేర్కొన్నారు.