News February 3, 2026
BREAKING.. కాకాణికి నోటీసులు

మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసు అధికారులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు, సోమిరెడ్డిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి దుర్బషలాడారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలులో కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు.
Similar News
News February 4, 2026
మనుబోలులో విజిలెన్స్ దాడులు.. రూ.కోటి సరుకు స్వాధీనం

మనుబోలులోని పెట్రోల్ బంక్ సమీపంలో జ్యన్తి మల్టీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా ఇండస్త్రిరియల్ ఆయిల్‌ను డీజిల్‌గా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆయిల్ తీసుకొచ్చి అమ్ముతున్నారన్నారు. రూ.లక్షా పదివేల లీటర్ల ఆయిల్‌ను, అయిదు ట్యాంకర్లను సీజ్ చేశారు.
News February 3, 2026
తిరుపతిలో మెహన్ బాబు, విష్ణుపై కేసులు

తిరుపతిలో విద్యార్థి సంఘాల <<19040348>>కిడ్నాప్<<>> వ్యవహారంలో మోహన్ బాబు, మంచు విష్ణు, MBU PRO సతీశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సతీశ్‌ను పోలీసులు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిపై తిరుచానూరు PSలో కేసు నమోదు అయింది.
News February 3, 2026
నెల్లూరు KVR పెట్రోల్ బంకు వద్ద రోడ్డు ప్రమాదం

నెల్లూరు నగరం KVR పెట్రోల్ బంకు వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇసుక టిప్పర్ బైక్‌ను ఢీకొనడంతో బైకుపై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించి గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారు నెల్లూరు వేదయపాలెంకు చెందిన మల్లికార్జున్, భరత్‌గా తెలుస్తుంది. అయితే ఢీకొట్టిన టిప్పర్ పరారవడం విశేషం.


