News January 21, 2026
BREAKING: కామారెడ్డి జిల్లాలో దారుణం

కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు కోతులకు మత్తుమందు ఇచ్చి చంపుతూ తమ గ్రామ శివారులో పడేస్తున్నారని బిక్కనూర్ మండలం అంతంపల్లి సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.తమ గ్రామ శివారులోని హరియాణా దాబా ప్రాంతంలో సుమారు 10కోతులు చనిపోయి ఉన్నాయని,మరికొన్ని మత్తుమందుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నాయన్నారు. ఈవిషయాన్ని ఫారెస్ట్ అధికారులకు తెలిపితే తమకు సంబంధం లేదంటున్నారన్నారు.
Similar News
News February 4, 2026
FLASH: తగ్గిన బంగారం ధర

బంగారం ధరలు కొనుగోలుదారులతో దోబూచులాడుతున్నాయి. ఇవాళ <<19045966>>ఉదయం<<>> భారీగా పెరిగిన గోల్డ్ రేటు సాయంకాలానికి కాస్త తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఉదయంతో పోల్చితే రూ.1,090 తగ్గి రూ.1,59,440కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,000 పతనమై రూ.1,46,150 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర ప్రస్తుతం రూ.3,20,000గా ఉంది.
News February 4, 2026
నెల్లూరుపై జగన్ స్పెషల్ ఫోకస్?

జగన్ నెల్లూరు రాజకీయాలపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. రూరల్‌పై పట్టుకోసం మాజీ మంత్రి అనిల్‌ను ఇన్‌ఛార్జ్‌గా నియమించే యోచనలో ఉన్నట్లు సమాచారం. అక్కడ 3 సార్లు MLAగా గెలిచిన కోటంరెడ్డి కుటుంబం బలంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో MLA తమ్ముడు గిరిధర్ రెడ్డి బరిలో ఉంటారని పలు సమావేశాల్లో ఆ పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో అనిల్ కోటంరెడ్డి కోటను ఢీ కొట్టగలరా?.
News February 4, 2026
ప్రకాశం: చిట్టీల పేరుతో రూ.10 కోట్లు తీసుకొని పరార్..!

సింగరాయకొండలో <<19045967>>చిట్టీల పేరుతో<<>> K. శ్రీను అనే వ్యక్తి సుమారు రూ. 10 కోట్లకు పైగా వసూలు చేసి పరారయ్యాడు. అధిక వడ్డీ ఆశచూపడంతో మహిళలు, రోజువారీ కూలీలు, విశ్రాంత ఉద్యోగులు తమ పొదుపు మొత్తాన్ని అతనికి అప్పగించారు. బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి పోలీసులను ఆశ్రయించడంతో భారీ కుంభకోణం వెలుగుచూసింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


