News April 14, 2025
BREAKING.. కుషాయిగూడలో మర్డర్

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో మర్డర్ జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో కమలాదేవి (60) అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లో పనిమనిషి హత్య చేసింది. ఈ నెల 11న హత్య జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 28, 2025
సభా సమయం.. వేడెక్కిన రాజకీయం!

TG: రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నేతల కామెంట్లతో రాజకీయం వేడెక్కింది. సభలో ప్రభుత్వం హుందాగా ప్రవర్తిస్తుందని, ప్రతిపక్షాల అనుమానాలను నివృత్తి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అటు ఎన్నిరోజులైనా సభను నడుపుతామని చెప్పే ప్రభుత్వం ఒక్కరోజుతో సమావేశాలు ముగించేస్తుందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. కనీసం 15రోజులైనా సభను నడపాలని ఆయన డిమాండ్ చేశారు.
News December 28, 2025
కరీంనగర్: రేపటి నుంచి యథావిధిగా ‘ప్రజావాణి’

జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం సోమవారం నుంచి యథావిధిగా కొనసాగుతుందని కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమానికి అర్జీదారులు హాజరుకావాలని సూచించారు. వివిధ సమస్యలపై వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
News December 28, 2025
జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండాలంటే?

జ్ఞాపకశక్తి బాగుండాలంటే మెదడుకూ వ్యాయామం అవసరం అంటున్నారు నిపుణులు. దీనికోసం రోజూ ధ్యానం చెయ్యడం, పజిల్స్ నింపడం, పుస్తకపఠనం, సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనడం మంచిదని సూచిస్తున్నారు. మెదడును ఎప్పుడూ చురుకుగా ఉండటానికి ప్రయత్నించాలి. దీంతో పాటు రోజూ వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి మెదడు పనితీరు బాగుంటుంది. జ్ఞానసంబంధమైన సామర్థ్యం పెరుగుతుందంటున్నారు.


