News April 14, 2025
BREAKING.. కుషాయిగూడలో మర్డర్

మేడ్చల్ జిల్లా కుషాయిగూడలో మర్డర్ జరిగింది. హౌసింగ్ బోర్డు కాలనీలో కమలాదేవి (60) అనే వృద్ధురాలిని ఆమె ఇంట్లో పనిమనిషి హత్య చేసింది. ఈ నెల 11న హత్య జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నుంచి దుర్వాసన వస్తోందని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 16, 2025
HYD: 1.30లక్షల మంది యువకుల దరఖాస్తు

నిరుద్యోగ యువత కోసం ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకంపై నగర యువత ఆసక్తి చూపారు. నిన్నటితో గడువు ముగియడంతో ఎంత మంది దరఖాస్తు చేశారనే విషయం లెక్కతేలింది. 1.3 లక్షల మంది యువకులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1,04,556 దరఖాస్తులు ఆన్‌లైన్‌లోకి రాగా 26,992 మంది ఆయా కార్యాలయాల్లో దరఖాస్తులు ఇచ్చారు.
News April 16, 2025
5 నిమిషాల్లో HYD జిల్లా చుట్టేయండిలా!

మీ జిల్లాలో జరిగిన అన్ని విషయాలు తెలుసుకునేందుకు Way2News యాప్‌లో ఇలా చేయండి. యాప్ ఓపెన్ చూస్తే రైట్ సైడ్ టాప్ మీ లొకేషన్ పేరుపై క్లిక్ చేయండి. పక్కన V సింబల్‌పై క్లిక్ చేస్తే 4 ఆప్షన్స్ మీ గ్రామం, మండలం, నియోజకవర్గం, జిల్లా చూపిస్తుంది. వాటిలో జిల్లాపై క్లిక్ చేస్తే 5MINలో మీ జిల్లా మొత్తం ఓ రౌండ్ వేయొచ్చు.
News April 15, 2025
ఉస్మానియా యూనివర్సిటీ PhD పరీక్షల తేదీలు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నిర్వహించే PhD పరీక్ష తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 25 నుంచి ఏప్రిల్ 27, 2025 వరకు జరగనున్నాయని, 3 రోజుల్లో రోజుకి మూడు సెషన్స్‌లలో సబ్జెక్టుల వారిగా తేదీలను ఇప్పటికే వర్సిటీ వెబ్‌సైట్‌లో వెల్లడించింది. దరఖాస్తు చేసిన అభ్యర్థులు https://www.ouadmissions.comలో తమ పరీక్ష తేదీని తెలుసుకోవచ్చని తెలిపింది.