News September 10, 2025
BREAKING: కూకట్‌పల్లిలో మహిళ హత్య

HYD కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక స్వాన్ లేక్ అపార్ట్‌మెంట్‌లో రేణు అగర్వాల్ (50) అనే మహిళను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. ఆమె కాళ్లు, చేతులు కట్టేసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. కూకట్‌పల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 8, 2026
కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉక్కుపాదం.. 103 మందిపై కేసులు

కామారెడ్డి జిల్లాలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 103 మంది పట్టుబడ్డారు. వీరికి న్యాయస్థానం రూ. 1,07,000 జరిమానా విధించగా, 21 మందికి జైలు శిక్ష పడింది. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ.. క్షణికానందం కోసం మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
News April 8, 2026
కేయూలో తొలిసారిగా ప్రత్యక్ష మూల్యాంకన విధానం!

కాకతీయ విశ్వవిద్యాలయంలో తొలిసారిగా ప్రత్యక్షంగా మూల్యాంకనం విధానం అమలులోకి తీసుకొచ్చారు. తప్పులకు ఆస్కారం లేకుండా ప్రతి ప్రక్రియను పర్యవేక్షించే విధంగా వ్యవస్థ పని చేస్తుందని పరీక్షల నియంత్రణ అధికారులు తెలిపారు. ఈ విధానంలో ఒక అధ్యాపకుడు మూల్యాంకనం చేయని పేపర్ ఆటోమేటిక్‌గా మరొక మూల్యాంకనాధికారికి వెళ్తుందని, రోజుకు 45 పేపర్ల మూల్యాంకనాన్ని నిర్ణయించినట్లు చెప్పారు.
News April 8, 2026
MHBD: చిట్టీల పేరుతో దంపతుల మోసం

మహబూబాబాద్ పట్టణంలో ‘ఓం శ్రీమన్నారాయణ చిట్ ఫండ్’ పేరుతో మోసానికి పాల్పడిన అజ్మీర మంగీలాల్, అతడి భార్య సావిత్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుల నుంచి సుమారు రూ.80 లక్షలు వసూలు చేసి, తిరిగి ఇవ్వకుండా వేధిస్తున్నట్లు టౌన్ సీఐ గట్ల మహేందర్ రెడ్డి తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఇలాంటి చిట్టీల నిర్వాహకుల పట్ల జాగ్రత్తగా ఉండాన్నారు.


