News March 1, 2025
BREAKING: కొత్తగూడెం: మరో రైతు ఆత్మహత్యాయత్నం

పురుగు మందు తాగి మరో రైతు బలవన్మరణానికి యత్నించిన ఘటన కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. ముత్తాపురం గ్రామానికి చెందిన పూసం నారాయణ తన పత్తి చేను వద్ద పురుగు మందు తాగి ఇంటికి వచ్చాడు. నోటి నుంచి నురుగు రావడంతో గమనించిన కుటుంబ సభ్యులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 2, 2025
ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

✓: ఖమ్మం: ‘రాణా పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్యా యత్నం’✓: 8న లోక్ అదాలత్: కారేపల్లి ఎస్ఐ✓: నేలకొండపల్లి:పొంగులేటి చొరవతో షాదీఖానాకు రూ.50లక్షలు✓:ఖమ్మం: ‘ఆలయం ఎదుట అశ్లీల నృత్యాలు’✓ ఖానాపురం:తప్పుడు పత్రాల రిజిస్ట్రేషన్ల ముఠాపై కేసు నమోదు✓చింతకాని: కారులోనే లింగ నిర్ధారణ పరీక్షలు.. ఇద్దరు అరెస్ట్✓:ఖమ్మం: 20లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు: మంత్రి తుమ్మల
News March 2, 2025
కొత్తగూడెంకి ఎయిర్ పోర్ట్.. కేంద్రమంత్రి క్లారీటీ..!

కొత్తగూడెం ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. గతంలో ప్రభుత్వం ఓ స్థలం కేటాయించిందని.. కానీ ఆస్థలం ఫీజుబిలిటీ లేదని ప్రభుత్వానికి తెలపగా మరో స్థలం కేటాయించిందన్నారు. అక్కడ AAI ఫీజుబిలిటీ స్టడీ చేసిందన్నారు. కానీ ఆ స్థలానికి రిమార్క్స్ ఉన్నాయని ఆ ప్రాంతం డేటా కావాలని ప్రభుత్వానికి సూచించామన్నారు. ఆ డేటా వచ్చిన తరువాత పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు.
News March 2, 2025
కొత్తగూడెం ఎయిర్‌పోర్ట్‌పై కనిపించని పురోగతి

కొత్తగూడెం జిల్లాలో ఎయిర్‌పోర్టుపై ఉమ్మడి ఖమ్మం ప్రజల ఆశలు అడియాసలవుతున్నాయి. ఇటీవల ఎయిర్‌పోర్టు ఏర్పాటుపై ఫీజిబిలిటీ సర్వే పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ప్రధాని మోదీ వరంగల్‌లో ఎయిర్‌పోర్టు అభివృద్ధికి అనుమతులు మంజూరు చేయగా వేగం పుంజుకుంది. కానీ కొత్తగూడెంలో మాత్రం ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ విషయంపై జిల్లా మంత్రులు, రాష్ట్రంలోని కేంద్రమంత్రులు దృష్టిసారించాలని ప్రజలు కోరుతున్నారు.