News February 20, 2025

BREAKING: కొత్తగూడెం: లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికాడు!

image

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి పట్టుబడ్డ ఘటన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి శంతన్ కుమార్ రైతుకు పత్తి అమ్ముకునేందుకు కూపన్ ఇవ్వడానికి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించడంతో సాయి శాంతన్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

Similar News

News February 21, 2025

BREAKING: ఖమ్మం: శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య

image

ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్‌లో గల శ్రీచైతన్య జూనియర్ కాలేజీ క్యాంపస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని డేగల యోగనందిని (17) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. ఉదయం స్టడీ అవర్‌కు హాజరైన ఆమె హాస్టల్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. మృతురాలు ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక వాసి సత్యరాజ్ కుమార్తెగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు.  

News February 21, 2025

ఖమ్మం మార్కెట్కు పోటెత్తిన మిర్చి

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు గురువారం మిర్చి పోటెత్తింది. దాదాపు 90 వేల బస్తాల మిర్చి మార్కెట్‌కు వచ్చింది. క్వింటాకు రూ.14,050 ధర పలికింది. ధర తగ్గుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. హమాలీలు దిగుమతి పేరుతో బస్తాకు రూ. 5 నుంచి రూ. 7, కాంటా వేసినందుకు బస్తకు మరో రూ. 3 , కమీషన్ దార్లు కటింగ్ పేరుతో ఇంకో రూ. 3 నుంచి రూ. 5 వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

News February 21, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

√ పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
√ మధిరలో విద్యుత్ సరఫరాల అంతరాయం
√ కొనిజర్ల మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
√ అమ్మపాలెం లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
√ సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన
√ మధిరలో కొనసాగుతున్న కుల గణన సర్వే
√ ఖమ్మం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

error: Content is protected !!