News August 13, 2025

BREAKING: ఖమ్మం: కారు బోల్తా.. ఇద్దరు మృతి

image

కారు అదుపుతప్పి బోల్తా పడడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన ముదిగొండ మండలంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. సీఐ మురళి తెలిపిన వివరాలిలా.. ముదిగొండ మండలం గోకినేపల్లి జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం అదుపుతప్పి ఓ కార్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఖమ్మం నగరానికి చెందిన వారుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.

Similar News

News August 13, 2025

HYD: రేపు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలి: సైబరాబాద్ పోలీసులు

image

భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర పోలీస్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ ఉద్యోగులకు రేపు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఉద్యోగులకు రేపు వర్క్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పించాలని ఐటీ కంపెనీలను సైబరాబాద్ పోలీసులు కోరారు. దీంతో ప్రమాదాల నియంత్రణ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ సూచించారు. వీలైనంత వరకు అందరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. SHARE IT

MNCL: రేపు పాఠశాలలకు సెలవు

image

భారీ వర్షాల కారణంగా గురువారం జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు అధికారులు సెలవు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కలెక్టర్ కుమార్ దీపక్ వెలువరించారు. పాఠశాలలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెలవు వద్దనుకునే ఉపాధ్యాయులు బడులకు హాజరై సేవలందించాలని పేర్కొన్నారు.