News April 7, 2025

BREAKING: ఖమ్మం జిల్లాలో దారుణ హత్య

image

ఖమ్మం పట్టణంలోని నేతాజీనగర్‌లో దారుణ హత్య జరిగింది. ఏలూరు జిల్లా చింతలపూడికి చెందిన రవిప్రసాద్ నాలుగు నెలలుగా ఖమ్మంలో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. కాగా, అర్ధరాత్రి ఇద్దరి మధ్య గొడవ జరగడంతో రవిప్రసాద్‌ను మహిళ నెట్టేసింది. గోడకు తగలడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పభుత్వాస్పత్రికి తరలించారు.

Similar News

News April 12, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిరలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం ∆} వైరాలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పర్యటన ∆} కల్లూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 12, 2025

వనజీవి మనవరాళ్లకూ మొక్కల పేర్లే

image

ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న రామయ్య <<16071045>>మృతితో<<>> పర్యావరణ ప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆయన ఇప్పటి వరకు కోటికి పైగా మొక్కలు నాటారు. అతని సేవలను గుర్తించిన కేంద్రం పద్మశ్రీతో సత్కరించింది. మొక్కలపై ఉన్న ప్రేమతో తన మనవరాళ్లకు కూడా వాటి పేర్లే పెట్టడం మరో ఆసక్తికర విషయం . వారికి చందనపుష్ప, హరిత లావణ్య. కబందపుష్ప అని పేర్లు పెట్టాడు. మరో మనవరాలికి వనశ్రీ అని నామకరణం చేశారు.

News April 12, 2025

ఖమ్మంలో భానుడి ఉగ్రరూపం.. 41.1 డిగ్రీలు నమోదు

image

ఖమ్మం జిల్లాలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శుక్రవారం అత్యధికంగా ఖమ్మం (రూ) పల్లెగూడెంలో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అటు నేలకొండపల్లి, ఖమ్మం(U) ఖానాపురం PSలో 41.0, మధిర, ముదిగొండ, చింతకాని 40.9, రఘునాథపాలెంలో 40.7, వైరా, కొణిజర్లలో 40.3, లింగాల (కామేపల్లి), కాకరవాయి (తిరుమలాయపాలెం) 40.0, తల్లాడలో 39.7, సత్తుపల్లిలో 38.7, ఏన్కూరులో 38.6 నమోదైంది.

error: Content is protected !!