News April 2, 2025
BREAKING: గద్వాలలో విషాదం

కరెంట్ షాక్‌తో ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన గద్వాల మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. వెంకటంపల్లి గ్రామానికి చెందిన యువకుడు నవీన్(30) వీరాపురం సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్‌లో సెంట్రింగ్ పని చేస్తుండగా ప్రమాదవశాత్తు ఐరన్ విద్యుత్ వైర్లపై పడి కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 19, 2025
మెదక్: వెబ్ సైట్‌లో మెరిట్ లిస్ట్ వివరాలు: డీఈఓ

మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీలు గల అకౌంటెట్, ANM ఉద్యోగాల భర్తీ కోసం మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల మెరిట్ లిస్ట్ వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి వెబ్ సైట్ (https://medakdeo.com/)లో ఉంచినట్లు డీఈఓ విజయ తెలిపారు. దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఆన్లైన్ ఉంచినట్లు పేర్కొన్నారు.
News December 19, 2025
జగిత్యాల: ‘రుణాలు మంజూరు చేయుటకు UBI సిద్ధం’

అర్బన్ మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు మంజూరు చేయుటకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్ధంగా ఉన్నట్లు జగిత్యాల డిప్యూటీ రీజనల్ హెడ్ శ్రీలత తెలిపారు. అర్హులైన SHGల రుణ దరఖాస్తులను ఈ నెల 24లోపు పంపాలని సూచించారు. PM వీధి వ్యాపారుల ఆత్మనిర్భర్ పథకం కింద దరఖాస్తులను పరిశీలించి వెంటనే రుణాలు మంజూరు చేస్తామని తెలిపారు. SHG రుణ లక్ష్య సాధనకు కృషి చేసిన రిసోర్స్ పర్సన్లను అభినందించారు.
News December 19, 2025
జగిత్యాల జిల్లాలో మాక్ డ్రిల్ నిర్వహణకు ఏర్పాట్లు

డిసెంబర్ 22న నిర్వహించనున్న విపత్తుల నిర్వహణ మాక్ డ్రిల్‌ను విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. ముందస్తు అప్రమత్తత, సమన్వయ చర్యలతో ప్రాణాలు, ఆస్తి నష్టాలు తగ్గించవచ్చని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో అధికారులు సిద్ధంగా ఉండి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.


