News April 3, 2025
BREAKING.. గద్వాల: బాలుడి తల, మొండెం వేరైంది!

మల్దకల్ మండలంలో గురువారం తీవ్ర విషాదం నెలకొంది. మండలంలోని నీలిపల్లిలో తల్లిదండ్రుల వెంట ఎనిమిదేళ్ల జీవన్ వరి పొలం దగ్గరికి వెళ్లాడు. వారు వరికోత యంత్రంతో పొలంలో పనులు చేయిస్తున్నారు. బాలుడు ఆడుకుంటూ మిషన్ దగ్గరికి వెళ్లడంతో.. అది ఆ బాలుడి మీది నుంచి వెళ్లింది. దీంతో బాలుడి తల, శరీరం వేరై అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 4, 2025
వికారాబాద్: భార్యను తిట్టాడని కొట్టి చంపాడు!

తన భార్యను అసభ్యంగా తిడుతున్నాడని కోపోద్రిక్తుడైన వ్యక్తి కర్రతో చితకబాదడంతో వృద్ధుడు మృతి చెందాడు. ఎస్ఐ అరవింద్ వివరాలు.. మోమిన్‌పేట్ మం. ఏన్కతలలో కిష్టయ్య (75) వికలాంగ వృద్ధుడు. తన ఇంటి పక్క మహిళను అసభ్యంగా తిడుతున్నాడని ఆమె భర్త కర్రతో కొట్టాడు. తీవ్రగాయాలు కావడంతో చనిపోయాడని కిష్టయ్య పెద్ద కుమారుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ అరవింద్ వెల్లడించారు.
News April 4, 2025
ఖమ్మం జిల్లాలో నేటి నేటి ముఖ్యాంశాలు

∆} నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యాటక
News April 4, 2025
రేషన్ షాపుల వద్ద నో స్టాక్ బోర్డులు!

TG: రాష్ట్రంలో రేషన్ లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ కొనసాగుతోంది. 3 రోజుల్లో దాదాపు 41వేల టన్నులకు పైగా బియ్యాన్ని సరఫరా చేసినట్లు సమాచారం. సన్నబియ్యం ఇస్తుండడంతో రేషన్ షాపులకు జనం భారీగా వస్తున్నారు. దీంతో మేడ్చల్, రంగారెడ్డి సహా పలు జిల్లాల్లోని దుకాణాల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిచ్చాయి. మళ్లీ స్టాక్ తెప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మీరు బియ్యం తెచ్చుకున్నారా? క్వాలిటీ ఎలా ఉంది?