News April 14, 2025
BREAKING: గద్వాల: యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాందేడ్ నుంచి పసుపు లోడ్‌తో కేరళకు వెళ్తున్న లారీ హైవే పక్కన ఆగింది. ఈ సమయంలో షాద్‌నగర్ నుంచి ఆళ్లగడ్డ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ షేక్ హుస్సేన్, క్లీనర్ వీరయ్య మృతిచెందారు.
Similar News
News July 6, 2025
పైసా పెట్టు.. కార్డు పట్టు.. జిల్లాల్లో ఇది పరిస్థితి.!

ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో నూతన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సాగుతుంది. కాగా ఇదే అదునుగా భావించి ఇరు జిల్లాలోని తహశీల్దార్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్లు, రెవిన్యూ ఇన్స్‌పెక్టర్లు రేషన్ కార్డు మంజూరు కోసం చేతివాటం ప్రదర్శిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నూతన రేషన్ కార్డు మంజూరు కోసం రూ.2, 3 వేలు డిమాండ్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు.
News July 6, 2025
రేపు అమలాపురంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం

అమలాపురం కలెక్టరేట్ గోదావరి భవన్‌లో సోమవారం యధావిధిగా పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా జిల్లా పరిధిలోని మూడు రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, నాలుగు మున్సిపల్ కార్యాలయాలు, 22 మండల కేంద్రాల్లో అర్జీలు స్వీకరిస్తారని పేర్కొన్నారు. ఫిర్యాదుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
News July 6, 2025
స్టాంప్ సవరణ బిల్లుతో ఉపయోగాలివే..

తెలంగాణ స్టాంప్ సవరణ బిల్లు-2025 తేవాలని <<16956370>>ప్రభుత్వం<<>> నిర్ణయించడంపై దీని ఉపయోగాలు ఏంటనే చర్చ మొదలైంది. చట్ట సవరణతో ప్రభుత్వ ఆదాయం పెంచుకోవచ్చని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెబుతున్నారు. కార్పొరేట్ సేవల రిజిస్ట్రేషన్ ఫీజులు, స్టాంప్ డ్యూటీని పెంచడం, రియల్ ఎస్టేట్, వాణిజ్య ఒప్పందాలకు చట్టబద్ధత కల్పించడంతో అదనపు ఆదాయం సమకూరుతుంది. నకిలీ స్టాంప్ పేపర్లు, డూప్లికేట్లు, స్కామ్‌లకు అడ్డుకట్ట వేయొచ్చు.