News April 14, 2025
BREAKING: గద్వాల: యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాందేడ్ నుంచి పసుపు లోడ్‌తో కేరళకు వెళ్తున్న లారీ హైవే పక్కన ఆగింది. ఈ సమయంలో షాద్‌నగర్ నుంచి ఆళ్లగడ్డ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ షేక్ హుస్సేన్, క్లీనర్ వీరయ్య మృతిచెందారు.
Similar News
News April 16, 2025
మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ WARNING

రైతులు పండించిన ధాన్యాన్ని రోడ్లపై ఆరబోసి ప్రమాదాలకు కారణం కావద్దని మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ జానకి ధరావత్ హెచ్చరించారు. అతి వేగంగా రోడ్లపై ప్రయాణించే వాహనదారులు రోడ్లపై కుప్పలుగా ఉన్న ధాన్యాన్ని గమనించకపోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారన్నారు. రోడ్లపై ధాన్యం కుప్పలు పోసి వాటిపై నల్ల కవర్లు కప్పడంతో రాత్రి సమయంలో అవి కనిపించడం లేదని, ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందన్నారు.
News April 16, 2025
బాలానగర్: ‘గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం’

బాలానగర్ మండలంలోని గంగాధర్‌పల్లి గ్రామ శివారులో చేపల వేటకు వెళ్లి ఇద్దరు గల్లంతైన ఘటన సోమవారం జరిగిన సంగతి తెలిసిందే. ఎస్ఐ లెనిన్ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బందితో గాలింపు చేపట్టారు. శివరాములు (46) మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం నిమిత్తం MBNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. యాదయ్య మృతదేహం ఇంకా లభ్యం కాలేదు.
News April 16, 2025
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ పునరావాస కేంద్రంలో అన్ని రకాల మౌలిక వసతులను వెంటనే కల్పించాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ ఉదండాపూర్‌లో పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాన్ని నిర్మించబోయే ప్రాంతాలను పరిశీలించారు. నిర్వాసితులకు ఫ్లాట్లు కేటాయించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు.