News April 14, 2025

BREAKING: గద్వాల: యాక్సిడెంట్.. ఇద్దరు మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించిన ఘటన గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం గ్రామ శివారులోని ఆర్టీఏ చెక్‌పోస్ట్ వద్ద సోమవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాందేడ్ నుంచి పసుపు లోడ్‌తో కేరళకు వెళ్తున్న లారీ హైవే పక్కన ఆగింది. ఈ సమయంలో షాద్‌నగర్ నుంచి ఆళ్లగడ్డ వెళ్తున్న లారీ అతివేగంగా వచ్చి ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో లారీ డ్రైవర్ షేక్ హుస్సేన్, క్లీనర్ వీరయ్య మృతిచెందారు.

Similar News

News April 16, 2025

నిర్మల్ : భూభారతిపై 17 నుంచి గ్రామ సదస్సులు: కలెక్టర్

image

భూభారతి చట్టంపై ప్రతి అధికారి పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌లో భూ సంబంధిత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భూభారతి చట్టం తీసుకొచ్చిందన్నారు. చట్టం ద్వారా ప్రజల భూసమస్యల పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. ఈనెల 17వ తేదీ నుంచి అధికారులంతా గ్రామాల్లో గ్రామ సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు.

News April 16, 2025

అయిజ: 16 నెలలయినా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు: BRSV

image

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 16 నెలలైనా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని బీఆర్ఎస్వీ జిల్లా కన్వీనర్ కురువ పల్లయ్య ఆరోపించారు. మంగళవారం అయిజ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని ఆయన అన్నారు. 6,000 ఉద్యోగాలు ఇచ్చి 60 వేల ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరుద్యోగులను మోసం చేస్తోందని మండిపడ్డారు.

News April 16, 2025

రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణం కావొద్దు: ఎస్పీ

image

రైతులు రోడ్లపై ధాన్యం ఆరబోసి ప్రమాదాలకు కారణం కావొద్దని మెదక్ SP ఉదయ్ కుమార్ రెడ్డి అన్నారు. రోడ్లపై వరి ధాన్యం ఆరబెట్టడంతో రోడ్లు ఇరుకుగా మారి రోడ్డు ప్రమాదాలు జరుగుతాయన్నారు. అదేవిధంగా ధాన్యంపై మోటార్ సైకిల్ వెళ్తే స్కిడ్ అయ్యి పడే అవకాశం ఉందన్నారు. రాత్రి సమయాల్లో రోడ్డుపై ధాన్యం కుప్పలు చేసి బండరాళ్లు పెట్టడంతో వాహనదారులు ప్రమాదాలుకు గురవతున్నారని, ఈ విషయాన్ని రైతులు గమనించాలన్నారు.

error: Content is protected !!