News December 11, 2025

BREAKING: గిద్దలూరు మాజీ MLA మృతి

image

గిద్దలూరు మాజీ MLA పిడతల రామ్ భూపాల్ రెడ్డి (89) స్వర్గస్థులయ్యారు. వయో భారంతో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాదులోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రామ్ భూపాల్ రెడ్డి ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. రామ భూపాల్ రెడ్డి TDP నుంచి పోటీ చేసి 1994లో MLAగా ఎన్నికయ్యారు. ఆయన కుమారుడు పిడతల ప్రవీణ్ కుమార్ రెడ్డి వైసీపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్‌గా బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Similar News

News December 18, 2025

పొన్నలూరు: బాకీ డబ్బుల కోసం మహిళ నిరసన.!

image

పొన్నలూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వడం లేదంటూ మధురైకి చెందిన మహిళ గురువారం అతని ఇంటి ఎదురుగా నిరసనకు దిగింది. తమ నుంచి రూ.68 లక్షలు తీసుకొని, చెల్లించాల్సిన ఇన్‌స్టాల్‌మెంట్ చెల్లించడం లేదంటూ మధురై నుంచి వచ్చి నిరసన తెలిపింది. సదరు వ్యక్తి లేకపోవడంతో.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై అనూక్ మాట్లాడి నిరసన విరమింపజేశారు.

News December 18, 2025

చంద్రన్న మార్కాపురం జిల్లా.. ఫ్లెక్సీ వైరల్‌.!

image

ప్రకాశం నుంచి విడిపోతున్న మార్కాపురం జిల్లా పేరు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. MLA కందుల నారాయణరెడ్డి జిల్లా ప్రకటన తర్వాత చంద్రన్న మార్కాపురం జిల్లాగా నామకరణం చేయాలన్నారు. దీనిని పలు సంఘాలు వ్యతిరేకించి, నల్లమల జిల్లా, కాటమరాజు జిల్లా పేర్లను ప్రతిపాదించాయి. ఇలాంటి పరిస్థితిలో ప్రస్తుతం ఓ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చంద్రన్న మార్కాపురం జిల్లా అంటూ ఫ్లెక్సీలో ఉండడం గమనార్హం.

News December 18, 2025

టంగుటూరు మర్డర్.. మృతుని వివరాలివే.!

image

ప్రకాశం జిల్లా టంగుటూరులో గురువారం ఓ హత్య జరిగిన విషయం తెలిసిందే. మృతుడు మర్రిపూడి మండలం కూచిపూడికి చెందిన వెంకటరమణయ్యగా పోలీసులు గుర్తించారు. రమణయ్య టంగుటూరు ప్రైవేట్ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నారు. రాత్రి నిద్రిస్తున్న సమయంలో దుండగులు ఇంట్లోకి ప్రవేశించి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి భార్య చనిపోగా కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సిఉంది.