News August 21, 2025

BREAKING: ‘గో బ్యాక్ మార్వాడీ’.. నల్గొండలో రేపు మొబైల్ షాపుల బంద్

image

తెలంగాణలో ‘గో బ్యాక్ మార్వాడీ’ ఉద్యమం ఉద్ధృతమవుతోంది. స్థానిక వ్యాపారులపై గుజరాత్, రాజస్థాన్ మార్వాడీల దౌర్జన్యానికి నిరసనగా శుక్రవారం తెలంగాణ బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. జేఏసీకి మద్దతుగా నల్గొండలో రేపు మొబైల్ షాపులు బంద్ చేస్తున్నామని మొబైల్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. అన్ని షాపులు మూసివేసి, బంద్‌ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Similar News

News August 21, 2025

కోనసీమను ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చాలి: జేసీ

image

కోనసీమ జిల్లాను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు ప్రజలందరూ సహకరించాలని జాయింట్ కలెక్టర్ నిశాంతి పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ సంచులకు బదులుగా జ్యూట్ సంచులను ఉపయోగించాలని సూచించారు. రైతుబజార్లలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, దాని వల్ల కలిగే అనర్థాలపై అవగాహన పెంచుకోవాలని కోరారు. జిల్లాను పరిశుభ్రంగా ఉంచడానికి పౌరులంతా తమవంతు బాధ్యతగా ప్లాస్టిక్‌ను దూరం పెట్టాలని ఆమె పేర్కొన్నారు.

News August 21, 2025

కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ప్రముఖులకు ఆహ్వానం

image

కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి 2025 వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం ఈ.వో పెంచల కిశోర్ జిల్లాలోని ప్రముఖులకు ఆహ్వాన పత్రిక అందించారు. వారిలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణాసారిక, ఎస్పీ మణికంఠ చందోలు, JC విద్యాధరి ఇతర ముఖ్య అధికారులు ఉన్నారు. వారికి ఈవో ఆహ్వాన పత్రికలు అందజేసి బ్రహ్మోత్సవాలకు రావాలంటూ కోరారు.

News August 21, 2025

ఖమ్మం: కేంద్ర ఆర్థిక మంత్రికి కలిసిన: డిప్యూటీ సీఎం

image

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పార్లమెంట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ఆర్థిక, అభివృద్ధి అంశాలపై ఇరువురు విస్తృతంగా చర్చించారు. ఈ భేటీలో ఎంపీలు పొరిక బలరాం నాయక్, రామసహాయం రఘురాం రెడ్డి, డాక్టర్ మల్లు రవి కూడా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన నిధులు, పథకాలు, ఆర్థిక సహాయంపై డిప్యూటీ సీఎం వివరించారు.