News August 21, 2025

BREAKING: ‘గో బ్యాక్ మార్వాడీ’.. రేపు దేవరకొండ బంద్

image

‘గో బ్యాక్ మార్వాడీ’ క్రమక్రమంగా తీవ్ర రూపం దాల్చుతోంది. స్థానిక వ్యాపారులపై రాజస్థాన్, గుజరాత్ మార్వాడీ వ్యాపారులు అరాచకాలు చేస్తున్నారని OU JAC ఇచ్చిన బంద్ పిలుపుకు మద్దతు ప్రకటిస్తున్నామని దేవరకొండ వ్యాపార అసోసియేషన్ సభ్యులు ఈరోజు తెలిపారు. శుక్రవారం దేవరకొండ సంపూర్ణ బంద్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. దేవరకొండ కోదండరామాలయం నుంచి భారీ ర్యాలీ చేస్తామన్నారు.

Similar News

News April 13, 2026

మంచిర్యాల జిల్లాలో BRS అభ్యర్థుల మార్పు?

image

రానున్న ఎన్నికల్లో మంచిర్యాల జిల్లాలోని 3నియోజకవర్గాల్లో BRS అభ్యర్థులను మార్చనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఆదివారం క్యాతనపల్లిలోని Ex ఎమ్మెల్యే సుమన్ నివాసంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మాట్లాడుతూ.. గోదావరి పరివాహక ప్రాంతంలో ఎమ్మెల్యేను మార్చగలిగితే తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఎవరు ఎక్కడ గెలుస్తారో అక్కడికి పంపిస్తామని, ఎలాంటి మొహమాటం లేదన్నారు.

News April 13, 2026

విజయశాంతిరెడ్డి ఆత్మహత్య.. భర్త సంచలన ఆరోపణలు

image

TG: హైదరాబాద్‌లోని చర్లపల్లిలో రెండు నెలల కిందట పిల్లలతో కలిసి <<19059157>>ఆత్మహత్య<<>> చేసుకున్న విజయశాంతిరెడ్డి భర్త సురేందర్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య కుటుంబీకుల వేధింపుల వల్లే వారు సూసైడ్ చేసుకున్నారని చెప్పారు. ‘నా అత్త పుష్పలత, బావమరిది చిరంజీవి నమ్మించి మోసం చేశారు. విజయ చనిపోయిన నాటి నుంచి ఆస్తుల కోసం నన్ను వేధించారు. వారి నుంచి నాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించాలి’ అని పోలీసులను కోరారు.

News April 13, 2026

‘B.Ed’ కాలేజీల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్!

image

AP: స్టడీ లీవ్ పేరిట ప్రైవేటు కాలేజీల్లో B.Ed, B.P.Ed చదువుతున్న టీచర్ల గురించి ఆరా తీసిన ఉన్నత విద్యామండలి విస్తుపోయే విషయాలు గుర్తించింది. వీరు క్లాసులకు హాజరు కాకుండా హాజరును మేనేజ్ చేసుకుంటున్నారు. ఇతర విద్యార్థులూ ఇలానే ఉన్నట్లు, ఏటా ఇదే తంతు నడుస్తున్నట్లు గమనించింది. ప్రమాణాలు దెబ్బతింటుండడంతో ఇకపై ఈ కాలేజీల్లో విద్యార్థులకు 2పూటలు ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్సును అమలుచేయాలని నిర్ణయించింది.