News October 11, 2025
BREAKING: జూబ్లీహిల్స్‌లో BJP కీలక నేత రాజీనామా

BJP జూబ్లీహిల్స్ నియోజకవర్గ మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేశ్ ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. CM రేవంత్ రెడ్డి, BJP గుట్టుచప్పుడు కాకుండా చేతులు కలిపి తెలంగాణను మోసం చేస్తున్నారని ఆరోపించారు. BJP, కాంగ్రెస్ కలిసి బీసీ రిజర్వేషన్ల విషయంలోనూ ప్రజలను మోసం చేశారని, రైతులు, యువత, మహిళలు, బీసీలు బాధలో ఉన్నా BJP మౌనంగా ఉందని, ఇక తాను పార్టీలో కొనసాగలేనని TBJP చీఫ్ రాంచందర్‌రావుకు లేఖ రాశారు.
Similar News
News October 11, 2025
మహిళా రైతు నాగేంద్రమ్మను సత్కరించిన కలెక్టర్, ఎమ్మెల్యేలు

ప్రకృతి వ్యవసాయ సాగులో ఆదర్శంగా నిలిచిన మహిళా రైతు నెట్టెం నాగేంద్రమ్మను జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, వ్యవసాయ అధికారులు, ముఖ్య అధికారులు కలిసి సత్కరించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన ధన, ధాన్య యోగం కార్యక్రమం ప్రారంభం అనంతరం ఆమెను సత్కరించారు. ప్రతి ఒక్కరు ముగ్గు చూపే విధంగా క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు.
News October 11, 2025
తెలంగాణకు ఐకానిక్‌గా టీస్క్వేర్ నిర్మాణం: రేవంత్

TG: HYDలోని రాయదుర్గం సమీపంలో టీస్క్వేర్ నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. ఇందులో యాపిల్ వంటి అంతర్జాతీయ సంస్థల ఔట్‌లెట్లు ఉండాలని చెప్పారు. తెలంగాణకు ఐకానిక్‌గా ఉండేలా NOV నెలాఖరు నుంచి పనులు ప్రారంభించాలని దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఏఐ హబ్ కోసం ప్రముఖ AI సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని సూచించారు. మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
News October 11, 2025
ఉస్మానియాలో డెత్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం!

ఉస్మానియా ఆసుపత్రిలో డెత్ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరగడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. బ్రాట్ డెడ్, అడ్మిట్ డెడ్ కేసులను మెడికల్ రికార్డు అధికారులు వెంటనే రికార్డు చేయకపోవడంతో సర్టిఫికెట్ పొందటానికి ఆలస్యం జరుగుతుందన్న విమర్శలు ఉన్నాయి. ఒక్కోసారి నెలల సమయం పడుతుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఆస్పత్రి కడుతోన్న ప్రభుత్వం ఇటువంటి సమస్యలపై ఫోకస్ చేయాలని కోరారు.