News October 24, 2025
BREAKING: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో 58 మంది

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ శనివారంతో పూర్తయింది. మొత్తం 81 మంది అభ్యర్థుల నామినేషన్లు అధికారులు ఆమోదించగా. ఆఖరి రోజు 23 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో 58 మంది అభ్యర్థులు నిలిచారు. పెద్ద సంఖ్యలో అభ్యర్థుల ఉపసంహరణ ఉంటుందని ఊహించినప్పటికీ చాలామంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోలేదు. దీంతో ఒక్కో కేంద్రంలో నాలుగు ఈవీఎంలు ఉండే అవకాశం ఉంది.
Similar News
News October 24, 2025
HYD: సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను జప్తు చేసిన ఈడీ

సాహితీ ఇన్ఫ్రా ఆస్తులను ఈడీ జప్తు చేసింది. మొత్తం ₹12.65 కోట్ల ఆస్తులను అటాచ్ చేసుకుంది. హైదరాబాద్‌లో ‘ఫ్రీ లాంచ్ ఆఫర్’ పేరిట వందల మందిని సాహితీ ఇన్ఫ్రా సంస్థ మోసం చేసినట్లు అధికారులు వెల్లడించారు. డైరెక్టర్ పూర్ణచందరరావు, కుటుంబ సభ్యులపై కేసు నమోదైంది. మొత్తం ₹126 కోట్ల డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ విచారణలో తేలింది.
News October 24, 2025
పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ బ్యాక్‌లాగ్ ఫలితాల విడుదల

ఓయూ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల వన్ టైం ఛాన్స్ బ్యాక్ లాగ్ పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్, ఎంకామ్ (ఐఎస్) తదితర కోర్సుల 2000-19 మధ్య బ్యాచ్‌ల విద్యార్థులకు వన్ టైం ఛాన్స్ అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఫలితాలు సిద్ధంగా ఉన్నాయని, విద్యార్థులు తమ మార్కు మెమోలను ఓయూ ఎగ్జామినేషన్ బ్రాంచిలోని పీజీ సెక్షన్ (రూం నంబర్.13) నుంచి తీసుకోవచ్చని సూచించారు.
News October 24, 2025
HYD: హమ్మయ్య! లాస్ట్ మినెట్‌లో ఫేట్ మారిపోయింది

కర్నూల్ బస్సు ప్రమాదం నుంచి సికింద్రాబాద్ చిలకలగూడ బడే మసీదుకు చెందిన తరుణ్ కుమార్ లక్కీగా తప్పించుకున్నారు. నిన్న రాత్రి పారడైజ్ వద్ద బస్సు ఎక్కాల్సి ఉండగా శంషాబాద్‌లో పని ఉందని అక్కడ బస్సు ఎక్కుతానని చెప్పారు. కానీ పని పూర్తి కాకపోవడంతో 40 నిమిషాల తర్వాత వేరే బస్సులో బెంగళూరు వెళ్లిపోయారు. దీపావళి సెలవులకు ఇంటికి వచ్చిన ఆయన నేవీలో లెఫ్టినెంట్ కమాండర్‌గా పనిచేస్తున్నట్లు Way2Newsకు తెలిపారు.


