News October 21, 2025
BREAKING: జూబ్లీహిల్స్ స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్‌లో KCR

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి BRS పార్టీ స్టార్ క్యాంపెయినర్లను ప్రకటించింది. ప్రచారంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత KCR పాల్గొననున్నట్లు వెల్లడించారు. ఆయనతో సహా పార్టీ తరఫున ప్రచారంలో 40 మంది ప్రముఖులు పాల్గొంటారు. మాజీ మంత్రులు KTR, హరీశ్‌రావు, శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు.
Similar News
News October 21, 2025
HYD: బీసీ నేతలపై కేసులను ఉపసంహరించుకోవాలి: ఆర్.కృష్ణయ్య

శాంతియుతంగా నిరసన తెలిపితే కేసులు పెడతారా అని BJP ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా బీసీ బంద్ విజయవంతమైందన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారని చెప్పారు. అయితే బీసీ బంద్‌లో చిన్నాచితక గొడవలు జరిగాయని, వాటిని పోలీసులు కోరంతను కొండంత చేసి అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. తమపై బనాయించిన 30 కేసులను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని సూచించారు.
News October 21, 2025
HYD: సీఎం ప్రజావాణికి 62 దరఖాస్తులు

బేగంపేట్‌లోని మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన సీఎం ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 62 దరఖాస్తులు అందాయి. దీపావళి వేడుకలు ఉన్నా ప్రజలు సీఎం ప్రజావాణికి వచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 18, రెవెన్యూ శాఖకు సంబంధించి 10, ఇందిరమ్మ ఇళ్ల కోసం 14, ప్రవాసి ప్రజావాణికి 2 దరఖాస్తులు వచ్చాయి. ఇతర శాఖలకు సంబంధించి 18 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
News October 21, 2025
జూబ్లీహిల్స్: ‘పోలింగ్ రోజు ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరి’

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ రోజు ప్రకటనలకు ముందస్తు అనుమతి తప్పనిసరని సీఈఓ సుదర్శన్ రెడ్డి మంగళవారం తెలిపారు. పోలింగ్ రోజు, దానికి ముందు రోజు పత్రికల్లో రాజకీయ ప్రకటనలు ప్రచురించాలంటే ఎంసీఎంసీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని ఆయన సూచించారు. రాష్ట్ర, జిల్లా స్థాయి ఎంసీఎంసీ కమిటీలు ఇప్పటికే క్రియాశీలంగా పనిచేస్తున్నాయని ఆయన తెలిపారు.