News January 15, 2026
BREAKING: టెర్రస్ వార్.. HYDలో చిందిన రక్తం

అత్తాపూర్ PS పరిధిలోని పాండురంగనగర్‌బస్తీలో పతంగులు ఎగరేస్తున్న సమయంలో రెండు అపార్ట్‌మెంట్‌ల వాసుల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఖాళీ సీసాలను పక్క బిల్డింగ్‌పైకి విసిరారు. కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా గొడవ జరిగింది. కొందరు యువకులు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు గాయాలు అయ్యాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
Similar News
News January 27, 2026
HYD: ‘వాడి టార్గెట్ GYM చేసే యువకులే’

జిం చేసే యువతకు అక్రమంగా స్టెరాయిడ్ ఇంజెక్షన్లు విక్రయిస్తున్న మొహమ్మద్ ఫైజల్ ఖాన్‌ను వెస్ట్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సూరత్ నుంచి వీటిని తెప్పించి ప్రిస్క్రిప్షన్ లేకుండా అత్తాపూర్ పరిసరాల్లో విక్రయిస్తున్నాడు. అతడి నుంచి భారీగా ఇంజెక్షన్లు, సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్లు వాడితే కిడ్నీలు, లివర్ దెబ్బతింటాయని డాక్టర్లు చెబుతున్నారు.
News January 26, 2026
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్ రావుకు సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ జోగినపల్లి సంతోష్ కుమార్‌కు సిట్ అధికారులు 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయానికి హాజరుకావాలని కోరారు. సిట్ విచారణకు సహకరించాలన్నారు.
News January 26, 2026
గోల్కొండ, చార్మినార్ కట్టడాలకు TOP 10లో చోటు

గోల్కొండ, చార్మినార్ కట్టడాలు భాగ్యనగర పేరును ప్రపంచవ్యాప్తం చేశాయి. వాటి అందాలను చూసేందుకు దేశ, విదేశాల నుంచి వేలాది మంది వస్తుంటారు. దేశంలోని చారిత్రక ప్రాంతాలను చూసేందుకు వచ్చేవారు ఈ రెండింటిని చూడకుండా వెళ్లరు. అందుకే టాప్ 10 ప్రదేశాల్లో గోల్కొండ, చార్మినార్ చోటు సంపాదించుకున్నాయి. గోల్కొండ కోట 6వ స్థానం, చార్మినార్ 10వ స్థానంలో ఉన్నాయి.


