News March 13, 2026

BREAKING: తగ్గిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.980 తగ్గి రూ.1,61,240కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.900 పడిపోయి రూ.1,47,800 పలుకుతోంది. వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2,90,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలుండొచ్చు.

Similar News

News March 26, 2026

గుంటూరు కలెక్టర్ బదిలీపై సోషల్ మీడియాలో చర్చ?

image

గుంటూరు కలెక్టర్‌గా కొనసాగుతున్న తమీమ్ అన్సారియాను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌గా నియమించే అవకాశముందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 2015 బ్యాచ్ అధికారిణిగా శ్రీకాకుళం, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమె పరిపాలనలో మంచి గుర్తింపు పొందారు. సామాజిక సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించారు. అయితే ఈ నియామకంపై ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు.

News March 26, 2026

అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం

image

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది.
➤ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం
➤ మైనింగ్ లీజులను వడ్డెర సొసైటీలకు కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం
➤ ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50% రాయితీ
➤ 96 jr., sr. సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం
➤ 2025-26 ఏడాదిలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ

News March 26, 2026

నియోజకవర్గాలు 50శాతం పెరుగుతాయి: చంద్రబాబు

image

నియోజకవర్గాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 50శాతం నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. దీని ద్వారా ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు వస్తాయని చెప్పారు. నియోజకవర్గాల పెంపు వల్ల పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, దీనిపై ప్రజలకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు.