News March 25, 2025

BREAKING: దండెంపల్లి SLBC కాలువలో ఇద్దరు గల్లంతు

image

నల్గొండ జిల్లా దండెంపల్లి SLBC కాలువలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. నేటి ఉదయం ఆరుగురు యువకులు దండెంపల్లి SLBC కాలువలో ఈతకు వెళ్లగా ప్రమాదవశాత్తు ఇద్దరు గల్లంతయ్యారని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 26, 2025

ADB: BC విద్యార్థులకు GOOD NEWS

image

BC విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను తమ వాటాను డైరెక్ట్‌గా కళాశాలల ఖాతాలకు జమచేయనున్నట్లు బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు తెలిపారు. అన్ని కళాశాలల యాజమాన్యాలు వారి బ్యాంకు అకౌంట్ డిటైల్స్, పాస్ బుక్ కాపీని బీసీ శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ నెల 27లోపు ONLINEలో పొందుపరుచాలని, లెటర్ హెడ్ పైన అకౌంట్ డిటేల్స్‌తో పాటు స్టేట్ మెంట్ కాపీ జత చేయాలని సూచించారు.

News March 26, 2025

అమ్మలూ.. హ్యాపీ బర్త్‌డే: NTR

image

టాలీవుడ్ స్టార్ హీరో Jr.NTR తన సతీమణి లక్ష్మీ ప్రణతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘అమ్మలూ.. హ్యాపీ బర్త్ డే’ అని విషెస్ తెలియజేశారు. ‘దేవర’ సినిమా రిలీజ్ సందర్భంగా వీరు ప్రస్తుతం జపాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వివాహం 2011లో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు అభయ్ రామ్, భార్గవ రామ్ ఉన్నారు.

News March 26, 2025

రుద్రవరంలో రాష్ట్రంలోనే అత్యధికం..!

image

నంద్యాల జిల్లాలో కొద్ది రోజులుగా భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం మంగళవారం నంద్యాల జిల్లా రుద్రవరంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.6°C ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి కాలం ప్రారంభంలోనే ఈ స్థాయిలో భానుడు విరుచుకుపడటంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, కొద్దిరోజులుగా నంద్యాల జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.

error: Content is protected !!