News April 8, 2025

BREAKING: దేవరకద్రలో 3 ప్రైవేట్ హాస్పిటల్స్ సీజ్..!

image

దేవరకద్ర మండల కేంద్రంలోని RMP ప్రైవేటు ఆసుపత్రులను రాష్ట్ర వైద్య బృందం సోమవారం తనిఖీ చేసింది. కొందరు నకిలీ RMP డాక్టర్లు ఎలాంటి అర్హత లేకుండా ప్రజలకు వైద్యం చేస్తున్నారని గుర్తించారు. ఈ మేరకు పట్టణంలోని సత్యసాయి క్లినిక్, సత్యశిలారెడ్డి అమ్మ క్లినిక్, శ్రీసాయి క్లినిక్‌ను సీజ్ చేశామని చెప్పారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతోన్న నకిలీ డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.

Similar News

News February 25, 2026

తెలుగు యూట్యూబర్ ఆత్మహత్య

image

తెలుగు యూట్యూబర్ కోమలి (21) ఆత్మహత్యకు పాల్పడింది. వైజాగ్‌కు చెందిన ఆమె హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఉంటూ చదువుకుంటోంది. హాబీగా యూట్యూబ్ వీడియోలు చేస్తూ గుర్తింపు పొందింది. సొంతూరికి చెందిన మరో యూట్యూబర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అఖిల్ రెడ్డితో ప్రేమ విఫలం కావడంతో మనస్తాపంతో ఉరి వేసుకొని చనిపోయిందని తెలుస్తోంది. కాగా అఖిల్ మోసం చేయడంతో బలవన్మరణానికి పాల్పడిందని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 25, 2026

టారిఫ్‌లపై ట్రంప్ కీలక ప్రకటన

image

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే దేశాలపై టారిఫ్‌లు విధించానని, వీటికి చట్టబద్ధత ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పునరుద్ఘాటించారు. దీనివల్ల US ప్రజలకు పన్నుల భారం తగ్గుతుందన్నారు. టారిఫ్‌ల విషయంలో కోర్టు తీర్పుపై ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నామని తెలిపారు. దురదృష్టవశాత్తూ దేశంలో సుప్రీంకోర్టు నుంచి పాలన సాగుతోందని మండిపడ్డారు. ఏది ఏమైనా అమెరికాను మరింత మెరుగ్గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు.

News February 25, 2026

అల్లూరి: డోలీ మోత.. దారిలోనే ప్రసవం

image

అనంతగిరిలో మరో డోలీ మోత ఘటన గిరిజనులు పడుతున్న దుర్భర పరిస్థితిని అద్దం పడుతోంది. మల్లిపాడుకు చెందిన గొల్లూరి సుమిత్రకు పురిటి నొప్పులు రాగా (25) బుధవారం తెల్లవారు జామున 3 గంటలకు మార్గమధ్యంలో ప్రసవమైంది. రోడ్డు సౌకర్యం లేక 6 కిలోమీటర్లు డోలీ మోతతో గ్రామస్థులు తీసుకొని వెళ్తుండగా ప్రసవించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.