News January 17, 2026
BREAKING: నంద్యాలలో తల్లి, ఇద్దరు పిల్లల మృతి

నంద్యాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. శనివారం లలితా నగర్‌లో తల్లి మల్లిక(26), పిల్లలు ఇషాంత్(3), పరిణితి(9 నెలలు) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. పిల్లలకు విషమిచ్చి తల్లి ఉరేసుకున్నట్లు తెలుస్తోంది. కొనఊపిరితో ఉన్న ముగ్గురినీ కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కోలుకోలేక మృతి చెందారు. భర్త ఉదయ్ కిరణ్, ఆడపడుచులే తల్లి, పిల్లలను చంపారంటూ ఆమె కుటుంబ సభ్యులు అరోపిస్తున్నారు.
Similar News
News February 5, 2026
ఇండియాకు ఎక్కడి నుంచైనా ఆయిల్ కొనే స్వేచ్ఛ ఉంది: రష్యా

అమెరికాతో ట్రేడ్ డీల్‌లో భాగంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లను ఇండియా ఆపేస్తుందన్న వార్తలపై మాస్కో సానుకూలంగా స్పందించింది. ‘ప్రపంచవ్యాప్తంగా మాతో పాటు చాలా మంది చమురు ఎగుమతిదారులు ఉన్నారు. ఢిల్లీకి రష్యా మాత్రమే సప్లయర్ కాదు. ఎక్కడి నుంచైనా ఆయిల్ కొనే స్వేచ్ఛ ఇండియాకు ఉంది. ఈ డీల్‌ను మేమేమీ కొత్తగా చూడట్లేదు’ అని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు.
News February 5, 2026
HYD: వర్క్ STRESSతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ SUICIDE

మియాపూర్‌లోని BKఎన్‌క్లేవ్‌లో ఓ యువకుడు గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. AP అమలాపురానికి చెందిన సతీశ్(31) గచ్చిబౌలిలోని ఓ ఐటీ సంస్థలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్నాడు. పనిఒత్తిడి తట్టుకోలేకే బలవన్మరణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. సతీశ్‌కు ఏడాది క్రితం వివాహం కాగా భార్య సొంతూరుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
News February 5, 2026
MDK: టీచర్‌గా మెప్పించి సూసైడ్ చేసుకుంది!

పాఠశాలలో నిర్వహించిన సెల్ఫ్ గవర్నమెంట్ డేలో టీచరై ఉత్తమ ప్రతిభ కనభరిచింది. అందరితో కలిసి మెలిసి మాట్లాడింది. సాయంత్రం ఇంటికి వచ్చి పనులన్నీ చేసింది. ఏమైందో తెలిదు కానీ తూప్రాన్ మండలం కోనాయపల్లి(PB)కి చెందిన పదో తరగతి విద్యార్థిని సుస్మిత(15) <<19052796>>సూసైడ్<<>> చేసుకుంది. సుస్మిత మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు శవాన్ని పోస్టుమార్టం కోసం తూప్రాన్ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.


