News February 13, 2026

BREAKING: నర్సాపూర్‌లో హంగ్

image

మెదక్ జిల్లా నర్సాపూర్‌లో హంగ్ ఏర్పడింది. ఇక్కడ మొత్తం 15 వార్డులకు గాను కాంగ్రెస్ 6, BRS 5, బీజేపీ 4 వార్డులు గెలిచాయి. మ్యాజిక్ ఫిగర్ సంఖ్య 8 ఎవరూ సాధించకపోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Similar News

News February 14, 2026

రాజ్యసభ భరిలో రాజధాని జిల్లా నేతలు.?

image

AP నుంచి రాజ్యసభలో 4 స్థానాలు ఖాళీ అవుతుండగా NDA కూటమికి ఆ స్థానాలన్నీ దక్కుతాయన్న వార్తలతో రాజధాని గుంటూరు జిల్లా నేతలు రాజ్యసభ సీటు కోసం పావులు కదుపుతున్నారు. వీరిలో భాష్యం రామకృష్ణ పేరు బలంగా వినిపిస్తుండగా గళ్లా జయదేవ్, కిలారు రాజేశ్, లింగమనేని రమేశ్ రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. మరి రాజ్యసభ సీటు ఎవరికి వస్తుందో కామెంట్ చేయండి.

News February 14, 2026

వారికి సున్నా.. తమ ఓటూ వేసుకోలేదు!

image

TG: సిద్దిపేట (D) హుస్నాబాద్ మున్సిపల్ ఫలితాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఐదో వార్డులో స్వతంత్ర అభ్యర్థి గడాసు రాంప్రసాద్‌కు ఒక్క ఓటూ పడలేదు. ఆఖరుకు తన ఓటు తానూ వేసుకోకపోవడం గమనార్హం. తాను బీజేపీ రెబల్‌గా పోటీ చేశానని చెప్పారు. తనతో కలిపి ఇంట్లో 3 ఓట్లు ఉండగా బీజేపీపై అభిమానంతో ఆ పార్టీకే వేసినట్లు వివరించారు. అటు మెదక్ జిల్లాలోని రామాయంపేటలోనూ మల్లేశం (ఇండిపెండెంట్)కు ఒక్క ఓటూ పడలేదు.

News February 14, 2026

చిత్తూరు: విద్యార్థిని పట్ల అసభ్య ప్రవర్తన.. PD సస్పెండ్

image

పెనుమూరు ZP ఉన్నత పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న చంద్రశేఖర్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో రాజేంద్రప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. 2025 మే నెలలో పాఠశాలలోని విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిపై HRDలో విద్యార్థిని తండ్రి ఫిర్యాదు చేశాడు. దీనిని విచారించాలని రాష్ట్ర విద్యాశాఖ నుంచి చిత్తూరు డీఈవోకు ఆదేశాలు అందాయి. ఈ క్రమంలో చిత్తూరు డీవైఈవో ఇందిర నివేదిక మేరకు ఆయన్ను సస్పెండ్ చేశారు.