News January 14, 2026
BREAKING.. నల్గొండ ఇక కార్పొరేషన్.. గెజిట్ విడుదల

నల్గొండ ఇకపై ‘మహానగర’ హోదాలో రూపాంతరం చెందనుంది. మున్సిపాలిటీని కార్పొరేషన్‌గా మారుస్తూ ప్రభుత్వం అధికారికంగా గెజిట్ విడుదల చేసింది. ఈ నిర్ణయంతో పట్టణాభివృద్ధిలో నవశకం ప్రారంభం కానుంది. కార్పొరేషన్ హోదాతో అదనపు నిధులు రావడమే కాకుండా, రోడ్ల విస్తరణ, భూగర్భ డ్రైనేజీ వంటి మౌలిక వసతుల కల్పనకు విస్తృత అవకాశాలు లభించనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 14, 2026
NLG: మున్సిపల్ ఎన్నికల్లో వాడిపోయిన కమలం

ఉమ్మడి NLG జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి నిరాశే మిగిలింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ కార్యకర్తలు ఆశించిన విజయం దక్కించుకోలేకపోయారు. యాదాద్రి జిల్లాలో 12 వార్డుల్లో BNG 4, CPL 3, గుట్ట 2, ఆలేరు 2, పోచంపల్లి 1, MLG, DVKలో ఒక్కో వార్డు మాత్రమే, SRPTలో కేవలం 1 సీటు మాత్రమే దక్కించుకున్నారు. మొత్తంగా జిల్లాల వారీగా 15 వార్డులు, NLG కార్పొరేషన్లో 4 డివిజన్లో మాత్రమే దక్కాయి.
News February 14, 2026
వరంగల్: హస్తం దెబ్బకు గులాబీ విలవిల!

BRSకు కంచుకోట అని చెప్పుకునే వరంగల్‌లో హస్తం దెబ్బతో ఆ పార్టీ కనుమరుగుకు దగ్గరైపోయింది. NSPTలో ‘పెద్ద’మాటలకు దొంతి హస్తంతో చెంపపెట్టు పెట్టారు. పరకాలలో ‘చల్ల’గా రే‘ఊరి’ వేశాడు. ములుగులో ‘బడా’కు సీ‘తొక్క’ తీశారు. డోర్నకల్, మరిపెడలో ఉద్దండుడికి ‘రెడ్’ సిగ్నల్ ఇచ్చారు. మానుకోటలో ‘మురళీ’గానంతో ‘శంకర’గిరి మాన్యాలకు పంపారు. BHPLలో ‘గండ్ర’ గొడ్డలితో వేటేశారు. ఘన్‌పూర్లో తాటికొండకు కడియం‘తౌటం’ పెట్టారు.
News February 14, 2026
మెదక్: ఈనెల 22న టీజీ సెట్ ప్రవేశ పరీక్ష

గురుకుల పాఠశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ఈ నెల 22న <


