News May 24, 2024
BREAKING: నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం చిన్న అడిశర్లపల్లి జాతీయ రహదారిపై కాసేపటి క్రితం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. పెద్దవూర మండలం ఉట్లపల్లి వాసులు పెరిక శ్రీను, కనకయ్య బైక్‌పై మల్లేపల్లి నుంచి ఇంటికి వెళ్తుండగా మరో బైక్ వారిని ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీను అక్కడికక్కడే మృతిచెందగా.. కనకయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 4, 2026
ముందస్తు బడిబాట.. విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యం!

పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ముందస్తు బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది. జిల్లాలో 31 పీఎంశ్రీ పాఠశాలలు ఉన్నాయి. ఉపాధ్యాయులు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లో బోధన ఉచిత, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్ ఇస్తున్నారని, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు బోధన చేస్తున్నారని చెబుతున్నారు.
News April 4, 2026
నల్గొండ: ధాన్యం కొనుగోళ్లలో జాప్యం

యాసంగి వరి కోతలు మొదలై పది రోజులైనా కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాలేదు. గతేడాది మార్చి 25నే తెరుచుకోగా, ఈసారి ఏప్రిల్ వచ్చినా జాడ లేదు. రా, బాయిల్డ్ రైస్ సమస్యలే ఈ జాప్యానికి ప్రధాన కారణం. ధాన్యం త్వరగా ఆరుతున్నా కొనుగోళ్లు లేక రైతులు కల్లాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. చిట్యాలలో నామమాత్రంగా ఒక కేంద్రం తెరిచినా కొనుగోళ్లు మొదలుపెట్టలేదు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
News April 4, 2026
6న కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యేనా?

ఈ నెల 6వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి కొనుగోళ్లు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి చేతుల మీదుగా నల్గొండ, తిప్పర్తిలో వీటిని అధికారికంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే మిల్లర్లతో చర్చలు సఫలం కాకపోవడంతో 6వ తేదీన కొనుగోళ్లు ప్రారంభం అవుతాయా లేదా అన్న సందిగ్ధత నెలకొంది. కొనుగోళ్లలో జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.


